సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: రేపు మంగళవారం , ప్రధాని నరేంద్ర మోదీ దేశంలోని వివిధ స్టేషన్ల మధ్య 10 కొత్త వందే భారత్ రైళ్లను ప్రధాని నరేంద్ర మోదీ ఢిల్లీ లో పర్చువల్ గా ప్రారంభించనున్నారు. అయితే వీటిలో మన తెలుగు రాష్ట్రాల్లోని సికింద్రాబాద్-విశాఖపట్టణం మధ్య నడవనున్న రెండో వందే భారత్ రైలును కూడా ప్రధాని ప్రారంభించనున్నారు. ఈ ట్రైన్ ఈనెల 13 నుంచి ప్రయాణికులకు అందుబాటులోకి రానుంది. ఈ రైలు వారానికి ఆరు రోజులు నడుస్తుంది. గురువారం విరామం. ప్రస్తుతం పశ్చిమ గోదావరి జిల్లా ప్రజలకు అందుబాటులో లేదు..తాడేపల్లి గూడెం కు హోల్డ్ ఇవ్వాలని ఎంపీ రఘురామా రైల్వే మంత్రి కి విజ్ఞప్తి చేసారు. మరో నెల రోజులలో తప్పకుండా హోల్డ్ వస్తుందని ఆయన భావిస్తున్నారు. ప్రస్తుతం విజయవాడ తరువాత రాజమండ్రి వరకు స్టాప్ లేదు.. 2 వందేమాతరం ట్రైన్స్ తాడేపల్లి గూడెం మీద నుండి వెళుతున్నప్పటికీ హోల్డ్ ఇవ్వక పోవడం గమనార్హం. రైలు నంబర్ 20707 ట్రైన్ సికింద్రాబాద్ నుంచి విశాఖపట్నం వందే భారత్ ఎక్స్ప్రెస్, సికింద్రాబాద్ నుంచి ఉదయం 05:05 గంటలకు బయలుదేరి మధ్యాహ్నము 01:50 గంటలకు విశాఖపట్నం చేరుకుంటుంది. మరో రైలు నంబర్ 20708 ట్రైన్ విశాఖపట్నం నుంచి సికింద్రాబాద్ వందే భారత్ ఎక్స్ప్రెస్ విశాఖపట్నం నుంచి మధ్యాహ్నం 02:35 గంటలకు బయలుదేరి రాత్రి 11:20 గంటలకు సికింద్రాబాద్ చేరుకుంటుంది.
