సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: బీజేపీ లో పొత్తు లో భాగంగా అసలే 24 సీట్ల తీసుకోని పూర్తీ నిరాశతో ఉన్న జనసేన క్యాడర్ ఇప్పడు జనసేన పార్టీ కేవలం 21 సీట్లకే పోటీ చేస్తుందని ( మరల వాటిలో భీమవరం నుండి అంజిబాబు తో సహా టీడీపీ అభ్యర్థులు మరి కొందరు..?) అలాగే 3 కు బదులుగా 2 ఎంపీ స్థానాలలో మాత్రమే పోటీ చేస్తుందని తాజా సమాచారం అందటంతో రాష్ట్రవ్యాప్తంగా సర్వము ఒడ్డి గత 5 ఏళ్లుగా పార్టీని నిలబెట్టుకున్న క్యాడర్ మరింత డీలా పడిపోతున్నారు. పొత్తులో భాగంగా లేట్ గా వచ్చిన బీజేపీ లేటెస్టుగా 6 ఎంపీ 10 అసెంబ్లీ స్థానాలకు డీల్ పిక్స్ చేసుకొన్నట్లు తెలుస్తుంది. ఈ నేపథ్యంలో తాజగా నేడు, మంగళవారం పవన్ కళ్యాణ్ ట్విటర్ వేదికగా జనసేన అభిమానులకు ట్వీట్ పెట్టారు. .. రాష్ట్ర భవిష్యత్తును దృష్టిలో ఉంచుకొని సీట్లు పంపకం జరిగిందని పేర్కొన్నారు. సీట్ల సంఖ్య.. హెచ్చుతగ్గుల కంటే రాష్ట్ర శ్రేయస్సు ముఖ్యమని మూడు పార్టీలు ధృడ సంకల్పంతో ముందడుగు వేశాయని మా ముగ్గురి పార్టీల కలయికతో జగన్‌ను చూస్తే జాలేస్తోంది! రాష్ట్ర అభివృద్ధి, ప్రగతి, ప్రజల స్థితిగతుల మెరుగుదలకు మూడు పార్టీలు కట్టుబడి ఉన్నాయి. రాష్ట్ర భవిష్యత్తును దృష్టిలో ఉంచుకొని సీట్లు పంపకం జరిగింది. కేంద్రంలోని ఎన్డీఏ, భాగస్వాములుగా రాష్ట్ర ప్రజలకు సేవ చేసే అవకాశాన్ని సద్వినియోగపరచుకుంటాము. మాతో చర్చల్లో పాల్గొన్న కేంద్ర మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్ కి, బీజేపీ జాతీయ ఉపాధ్యక్షులు బైజయంత్ పాండాకి, టీడీపీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు కి కృతజ్ఞతలు’’ అని తెలిపారు.
