సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: తమకు పదవి ఇచ్చిన వైసీపీ పార్టీ కి వ్యతిరేకంగా పనిచేస్తున్నారని సమగ్ర విచారణ తదుపరి నేడు, మంగళవారం ఇద్దరు ఎమ్మెల్సీలపై మండలి చైర్మెన్ మోషేను రాజు అనర్హత వేటు వేశారు. ఎమ్మెల్సీలు వంశీకృష్ణ యాదవ్ , సి రామచంద్రయ్య పై అనర్హత వేటు పడింది. ఇటీవల జనసేన లో చేరిన వంశీకృష్ణ, టీడీపీ లో చేరిన సి రామచంద్రయ్యపై శాసనమండలి చైర్మన్ మోషేన్ రాజు చర్యలు తీసుకున్నారు. వంశీకృష్ణ, రామచంద్రయ్యలు వైసీపీ తరుఫున విజయం సాధించి ఆపై ఇటీవల పార్టీ మారారు. వీరిపై చర్యలు తీసుకోవాలంటూ మండలి కార్యదర్శికి వైఎస్సార్సీపీ నేత, మండలిలో చీఫ్ విప్ మేరిగ మురళీధర్, ఎమ్మెల్సీ లేళ్ల అప్పిరెడ్డిలు శాసనమండలి ఛైర్మన్‌కు ఫిర్యాదు చేశారు.
