సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: భీమవరం పట్టణంలోని తన ఉండి నియోజకవర్గ కార్యాలయంలో తెలుగు దేశం పార్టీ కీలక నేత, ఉండి మాజీ ఎమ్మెల్యే వేటుకూరి శివరామరాజు నేడు, గురువారం మీడియా తో మాట్లాడుతూ.. తాను ఉండి నుండి వరుసగా 2 సార్లు ఎమ్మెల్యే ప్రజాభిమానంతో ఎన్నికయ్యాయని, గత ఎంపీ నరసాపురం అభ్యర్థిగా టీడీపీ తరపున నిలబడి 30 వేలు పైచిలుకు స్వల్ప ఓట్ల తేడాతో ఓటమి చెందిన కూడా కష్టా కాలం లో ఉన్న పార్టీ కోసం , ఆర్ధికంగా ఎంతో నష్టపోయి కష్టపడి పనిచేస్తే కనీసం తనను సంప్రదించకుండా,చంద్రబాబు టికెట్ మరొకరికి ఇచ్చి దారుణంగా పరాభవించారని, 2దశాబ్దాలుగా సర్వము ఒడ్డి పార్టీ పక్షాన నిలబడితే ..పార్టీ పెద్దలు పలకరించేవాడు లేకుండా నడిరోడ్డు ఫై వదిలేశారని,వారికీ ఉండి లో నా సత్తా చూపిస్తాను అని, గత కొన్ని రోజులుగా ఉండి ప్రజలు నా అభిమానులు అభిప్రాయం తీసుకొన్నానని, వారిచ్చిన మద్దతుతో ఎన్నికల బరిలో నిలబడుతున్నానని ఏ పార్టీ నుంచి పోటీచేసేది రెండు రోజుల్లో ప్రకటిస్తానని అన్నారు. శివరామరాజు తో ప్రస్తుతం అధికార వైసీపీ పెద్దలుతో చర్చలు ఒక కొలిక్కి వచ్చాయని? తెలుస్తుంది. తాజా పరిణామాలలో ఇప్పటి వరకు ఆయన కార్యాలయం కు ఉన్న టీడీపీ చంద్రబాబు ఫ్లెక్సీ లను అన్ని తొలగించారు. మరి వైసీపీ ఫ్లెక్సీ లతో అలంకరిస్తారో? లేక స్వతంత్ర అభ్యర్థిగా బరిలో దిగుతారో కొద్దీ గంటలలో తేలిపోతుంది..

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *