సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: నేడు, గురువారం భరణి నక్షత్రము నందు భీమవరం పట్టణ పురాధీశ్వరి శ్రీశ్రీశ్రీ మావుళ్ళమ్మ అమ్మవారి కి లక్ష పుష్పార్చన కార్యక్రమం ను దేవస్థానం ప్రధాన అర్చకులు మద్దిరాల మల్లిఖార్జున శర్మ నేత్రుత్వములో, దేవస్థానం ధర్మకర్తలు మండలి సభ్యులు, చైర్మెన్, మానేపల్లి నాగేశ్వర రావు ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ముందుగా శ్రీ విఘ్నేశ్వరస్వామి వారి పూజ, నిర్వహించి తదుపరి శ్రీ అమ్మవారి సమక్షంలో ఉత్సవ విగ్రహానికి అభిషేకం తదనంతరం లక్ష పుష్పార్చన పండితుల వేద మంత్రాల నడుమ ఘనంగా నిర్వహించారు. విశేషంగా హాజరు అయిన మహిళా భక్తులకు పుష్పాలు మరియు ప్రసాదాలు అందజేసినట్లు దేవాలయ అసిస్టెంట్ కమీషనర్ & ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్, బుద్ధ మహాలక్ష్మి నగేష్ తెలిపారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *