సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో తాను విశాఖపట్నం నార్త్ నియోజకవర్గం నుంచి పోటీ చేస్తున్నానని ఇటీవల కొత్త రాజకీయ పార్టీ స్థాపించిన ‘ జై భారత్ పార్టీ’ అధ్యక్షుడు, సీబీఐ మాజీ జె.డి. వి.వి.లక్ష్మీనారాయణ ప్రకటించారు. ఎంవీపీకాలనీ సెక్టారు-10లోని ఉత్తరాంధ్ర పార్టీ కార్యాలయాన్ని ప్రారంభించారు. నేడు, శుక్రవారం ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ.. రాష్ట్రంలో తృతీయ ప్రత్యామ్నాయం కోసమే యునైటెడ్ ఫ్రంటు ఏర్పాటు చేశామన్నారు. రాష్ట్రంలో వాలంటీర్ల వ్యవస్థ ద్వారా స్థానిక స్వపరిపాలన పోయిందని.. చట్టాల రూపకల్పనలో ప్రజల అభిప్రాయం తీసుకోవటం లేదన్నారు. రాష్ట్రంలో గ్రూపు-1ను రద్దు చేసి మళ్లీ నిర్వహించాలని డిమాండ్ చేశారు.
