సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: భీమవరం పట్టణంలో గత దశాబ్ద కాలంగా వైసీపీ పార్టీ ఆవిర్భకాలం నుండి పార్టీలో పనిచేస్తూ వైసీపీ పార్టీ అధికారంలో లేనప్పుడు 2014 నుండి భీమవరం మున్సిపల్ కౌన్సిలర్ గా 5 ఏళ్ళు కొనసాగి మరియు కౌన్సిల్ లో ప్రధాన ప్రతిపక్షనేత గా ఫ్లోర్ లీడర్ గా పనిచేసిన గాదిరాజు సుబ్రమణ్యరాజు( తాత రాజు) మంగళగిరిలో పవన్ కళ్యాణ్ సమక్షంలో జనసేన పార్టీలో చేరిపోవడం వైసీపీ శ్రేణులలో ఇటు ప్రతిపక్ష పార్టీలలో షాక్ కు గురిచేసింది. కొద్దీ కాలం క్రితం వరకు అధికార వైసీపీ పార్ట్ తరపున భీమవరం 2 టౌన్ ఇంచార్జి గా కీలక పదవి కూడా నిర్వహించారు. దీనిపై సిగ్మా న్యూస్ తో తాతారాజు మాట్లాడుతూ.. .. వైసీపీ పార్టీ ఆవిర్భావం నుండి సీఎం జగన్ అధికారంలోకి రావాలని కష్టపడి పనిచేశానని, కౌన్సిల్ లో వైసీపీ తరపున ప్రతిపక్ష నేతగా ప్రజలు కోసం అధికార టీడీపీ ప్రభుత్వంపై ఎన్నో పోరాటాలు చేసానని, ( అప్పటి టీడీపీ పార్టీ చైర్మెన్ చినబాబు ఫై) అయితే 2019 లో పార్టీ అటు రాష్ట్రంలో భీమవరంలో వైసీపీ అధికారంలోకి వచ్చినప్పటికీ తనకు పార్టీలో ప్రాధాన్యం తగ్గుతూ వస్తుందని, ఎన్నో ఇబ్బందికర పరిస్థితులలో పార్టీలో ఇమడలేకపోయినా సరే.. విలువలతో వైసీపీ పార్టీ ప్రతిష్టాత కోసం తనను నమ్ముకున్న స్థానిక ప్రజల సంక్షేమం కోసం అభిమానుల కోసం నిస్వార్ధంగా పని చేసానని, ఈ ఎన్నికల వేళ భీమవరం వైసీపీ పెద్దలకు గౌరవప్రదంగా నా అసంతృప్తి ని తెలియపరచి…ఇక ఇక నా ఆశయస్ఫూర్తి కి ప్రజా సంక్షేమానికి జనసేన సరియిన పార్టీ అని భావించి అధినేత పవన్ సమక్షంలో పార్టీలో చేరానని, ఇప్పడు చినబాబు సారధ్యంలో భీమవరం నియోజకవర్గ అభ్యర్థిగా పోటీచేస్తున్న సౌమ్యుడు, రాజకీయాల కన్నా ప్రజల అభివృద్ధి ని కాంక్షించే పులపర్తి రామాంజనేయులు గెలుపు కోసం నేను నన్ను నమ్మిన క్యాడర్ కలసి నిబద్దత తో పనిచేస్తామని తెలియజేసారు.
