సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: తెలుగు దేశం పార్టీ అభ్యర్థిగా ఆచంట అభ్యర్థిగా పోటీచేస్తున్న మాజీ మంత్రి పితాని సత్యనారాయణ నియోజకవర్గంలో ‘ప్రజల వద్దకు పితాని పాదయాత్ర’ చేస్తూ ప్రచారంలో దూసుకొనిపోతున్నారు. వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత.. గత ఎన్నికలలో హామీ ఇచ్చిన మద్యాన్ని నియంత్రించడం మానేసి ఏకంగా కల్తీ మద్యాన్నే భారీ రేట్లకు అమ్మి ప్రజల అనారోగ్యానికి ఈ ప్రభుత్వం కారణమైందని, రాష్ట్రాభవృద్ధి కోసం త్వరలో జరిగే ఎన్నికల్లో వైసీపీ ప్రభుత్వాన్ని గద్దె దింపాలని మాజీ మంత్రి పితాని సత్యనారాయణ ప్రచారం చేస్తున్నారు. ఆచంట మండలం వల్లూరు, పెనుగొండ మండలం దేవ గ్రామంలో ‘ప్రజల వద్దకు పితాని పాదయాత్ర’ ను నేటి శనివారం తో పూర్తీ చేస్తున్నారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. జనసేన, టీడీపీ, బీజేపీ కూటమి క్యాడర్ కలసి పనిచేస్తే, భారీ విజయం సాధించడం ఖాయమన్నారు. పితాని కూడా స్థానిక జెడ్పిటిసి లు ఎంపీటీసీ ప్రజాప్రతినిధులు స్థానిక టీడీపీ జనసేన నేతలు పాల్గొంటున్నారు.
