సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: యువ నిరుద్యోగులకు శుభవార్త, దేశంలో స్టాక్ మార్కెట్ల నియంత్రణ సంస్థ SEBI లో 1 లక్ష కు పైగా భారీ వేతనాలతో ఉద్యోగాలు భర్తీ కి ఆహ్వానం పలికింది. పలు విభాగాల్లో మొత్తం 97 ఆఫీసర్ గ్రేడ్ (అసిస్టెంట్ మేనేజర్) ఉద్యోగాలకు దరఖాస్తులు స్వీకరించనున్నట్లు ఓ ప్రకటనలో ప్రకటించింది. మొత్తం 97 ఉద్యోగాలకు గాను.. జనరల్ విభాగంలో 62, ఐటీలో 24, లీగల్ విభాగంలో 5, ఇంజినీరింగ్(ఎలక్ట్రికల్), రీసెర్చ్, అఫీషియల్ లాంగ్వే జ్ కేటగిరీల్లో చెరో రెండు చొప్పున పోస్టులను భర్తీ చేస్తారు. జనరల్, లీగల్, ఐటీ, ఇంజినీరింగ్ ఎలక్ట్రికల్, రీసెర్చ్ అండ్ అఫీషియల్ లాంగ్వేజ్ కేటగిరీల్లో ఖాళీలను భర్తీ చేసేందుకు ఏప్రిల్ 13 నుంచి ఆన్ లైన్ లో ఆహ్వానించనున్నట్లు పేర్కొన్నారు. ఈ పరీక్షకు దరఖాస్తు చేసుకొనే ఎస్సీ/ఎస్టీ/ఓబీసీ/ దివ్యాంగులకు ఉచితంగానే శిక్షణ ఇస్తారు. ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకొనే అభ్యర్థులు సంబంధిత విభాగాల్లో గ్రాడ్యు యేషన్/పీజీ పూర్తి చేసి ఉండాలి. వయో పరిమితి: 2024 మార్చి 31 నాటికి అభ్యర్థుల వయస్సు 30 ఏళ్లు దాటకూడదు.
