సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: కోస్తా తీరంలో ఏప్రిల్ 15 నుంచి జూన్ 15 వరకు చేపల వేటను నిలిపివేయనున్నారు. ఈ మేరకు కేంద్ర మత్స్యశాఖ నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ నేపథ్యంలో భీమవరం , నరసాపురం నియోజవర్గాలలో ఉన్న సముద్రతీర ప్రాంత మత్య కారులు కూడా ఈ నిబంధనలు పాటించాలి. ఈ కాలంలో సముద్రంలో మత్య సంపద పునరుత్పత్తి కోసం చేప పిల్ల‌లు పెరిగే సమయం కాబట్టి ప్రతి సంవత్సరం ఏప్రిల్-జూన్ మధ్య 61 రోజులు చేపల వేట నిషేదిస్తారు. దీంతో ఏపీతో పాటు అన్ని కోస్తా రాష్ట్రాల్లో చేప‌ల వేట నిషేదాన్ని అమలు చేయబోతున్నారు. మత్స్యశాఖ జెడి విజయకృష్ణ మాట్లాడుతూ.. కేంద్ర ప్రభుత్వ ఆదేశాలకు అనుగుణంగా ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వ అధికారులు కూడా ఈ నిషేదిత సమయంలో మత్యకారులు ఆజ్ఞలను ఉల్లంఘిస్తే చట్టప్రకారం చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *