సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: కలియుగ వైకుంఠం తిరుమల తిరుపతిలో ఈ వేసవిలో విద్యార్థులకు పరీక్షల సమయం కావడం తో, ఎన్నికల కోడ్ నేపథ్యంలో వీఐపీ బ్రేక్ దర్శనం ప్రజాప్రతినిధుల సిపార్సు లేఖలకు అనుమతి లేకపోవడం తో భక్తుల రద్దీ ఇటీవల బాగా తగ్గింది. నేడు బుధవారం భక్తులు ఎటువంటి నిరీక్షణ లేకుండా పలుమారులు ధర్మ దర్శనం చేసుకొని తమ అదృష్టానికి పొంగిపోతున్నారు. నిన్నటి మంగళవారం నుంచి దేవాలయ అధికారులు భక్తులకు వేచి ఉండే అవకాశం లేకుండా నేరుగానే శ్రీవారి దర్శనం కల్పిస్తున్నారు. మంగళవారం స్వామివారిని 63251 మంది భక్తులు దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. నిన్న శ్రీవారి హుండీ ఆదాయం రూ.4.14 కోట్లు వచ్చినట్టు తిరుమల తిరుపతి దేవస్థానం (TTD) ప్రకటించింది. నేటి నుంచి ఐదు రోజుల పాటు శ్రీవారి వార్షిక తెప్పోత్సవాలను టీటీడీ నిర్వహించనుంది. ఇవాళ శ్రీరాముని అవతారంలో తెప్పలపై స్వామివారు విహరించనున్నారు. ఈ సందర్భంగా ఆర్జిత బ్రహ్మోత్సవం, సహస్రదీపాలంకరణ సేవలను టీటీడీ రద్దు చేసారు.
