సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: మాజీ తెలుగుదేశం ఎమ్మెల్యే కలవపూడి శివరామరాజు ఈసారి పార్టీ టికెట్ రాకపోవడంతో అధిష్టానం ఫై అలిగి తీవ్ర నిరాశతో స్వతంత్ర అభ్యర్థిగా రంగంలోకి దిగిన విషయం తెలిసిందే.. భీమవరంలోని ఆయన కార్యాలయం నుండి పావులు వేగంగా కదుపుతున్నారు. ప్రజలతో మమేకం అవుతున్నారు. దీనిలో భాగంగా ఆయనకు సంఘీభావం తెలుపుతూ ఆయన మద్దతుదారులు ఉండి నియోజకవర్గంలోని ఆకివీడు, ఉండి లతోపాటు కాళ్ళ పాలకోడేరు మండలాల మీదుగా భారీ సంఖ్యలో కార్లు బైక్స్ వాహనాలతో శివరామరాజు అభ్యర్ధిత్వాన్ని బలపరుస్తూ చేస్తున్న భారీ ర్యాలీ నేడు, బుధవారం ఉదయం పెద్దమిరం లోని శ్రీ ఆదినాధ్ జైన గుడి నుండి ప్రారంభించారు. ఈసారి ఉండి లో జరిగే ప్రధాన పోటీలో టీడీపీ వైసీపీ అభ్యర్థులతో పాటు స్వతంత్ర అభ్యర్థిగా శివరామరాజు కూడా తన సత్తా చాటే దిశగా.. గతంలో 10 ఏళ్ళు ఎమ్మెల్యేగా తాను ప్రజలకు చేసిన అభివృద్ధిని గుర్తుకు తెచ్చేలా ప్రచారం నిర్వహిస్తున్నారు. స్థానిక పలువురు టీడీపీ మద్దతు పలికే కుటుంబాలకు చెందిన మహిళల నుండి ఆయనకు సానుభూతి తో పాటు హారతులతో స్వాగతసత్కారాలు అందుతుండటం గమనార్హం..
