సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: ఎన్నికల ప్రచారంలో పార్టీలు కొత్త పుంతలు త్రొక్కుతున్నాయి. ఇప్పటికే అధికార పార్టీ కి మద్దతుగా యాత్ర, ప్యూహం, శపధం వంటి సినిమాలను రిలీజ్ చెయ్యగా,ప్రతిపక్ష పార్టీ కి మద్దతుగా రాజధాని ఫైల్స్ అంటూ.. ఆ సినిమాలు థియేటర్స్ లో కన్నా వాటి క్లిప్స్ మీడియా ఛానెల్స్ లో వారి పార్టీ వర్గాలను బాగా సంతోష పెట్టాయి. ఎన్నికల ముందు ఓటిటి లో ఇంటిటికి తీసుకొని వెళ్లే ప్యూహంతోనే ఈ సినిమాలను లాభ నష్టాల ప్రమేయం లేకుండా రిలీజ్ చేస్తున్నారని సామాన్యులకు సైతం తెలుసు. అయితే ఎన్నికల కోడ్ వచ్చాక కాస్త ఆలస్యంగా జనసేనాని కూడా తన పార్టీ ప్రచారం కోసం షూటింగ్ సగంలో నిలిపివేసిన ఉస్తాద్ భగత్ సింగ్ సినిమా టీజర్ కు హడావిడిగా డబ్బింగ్ చెప్పి తాజగా టీజర్ ను మీడియాలో విడుదల చేసారు. ఆ టీజర్ అంతా జనసేన సింబల్ గాజు గ్లాస్ ను హైలైట్ చేసే ప్రయత్నం చేసారు. అది క్లియర్ గా తెలుస్తూనే వుంది. గ్లాసు పగిలే కొలది పదును ఎక్కుతుంది.. గాజు గ్లాస్ కు కనపడని సైన్యం ఉందని పవన్ కళ్యాణ్ డైలాగ్స్ చెప్పారు. గ్లింప్స్ ను కట్ చేయడంలో అసలు సినిమాలో అవి ఏ సన్నివేశానికి చెందినవో? తెలియదు కానీ ప్రస్తుతానికి పవన్ అభిమానులను అలరిస్తున్నాయి. రాజకీయాలకు ఏమేర ఉపయోగపడతాయో కానీ దీనిపై ఏపీ ఎన్నికల అధికారి ముకేశ్ కుమార్ కి కొందరు పిర్యాదు చెయ్యడంతో ఆయన దీనిపై మాట్లాడుతూ.. ఆ టీజర్ తాను చూడలేదని అయితే గాజు గ్లాస్ ఫై ప్రచారం చేసుకొనే హక్కు పవన్ కు ఉందని కానీ అది సినిమా వీడియో ప్రచారం కాబ్బటి.. అయిన అందులో పార్టీ సింబల్ ను ప్రచారం చేస్తున్నారు కాబ్బటి ఎన్నికల కమిషన్ అనుమతి తీసుకొంటే బాగుండేదని ఈ పిర్యాదు పరిశీలిస్తానని అన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *