సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: భీమవరం పట్టణ మునిసిపల్ కమిషనర్ ఎం శ్యామల ఆధ్వర్యంలో పట్టణంలో ఛాంబర్ అఫ్ కామర్స్ ప్రసిడెంట్, సభాపతి, కాగిత రమణ తదితర సభ్యులతో మరియు పట్టణ ప్రముఖులు ట్రాఫిక్ పోలీస్ అధికారులతో నేడు, గురువారం ఏర్పాటు చేసిన సమావేశంలో.. పట్టణంలో ట్రాఫిక్ అంతరాయం ఏర్పడి ప్రజలకు ముఖ్యంగా ప్రయాణికులకు అసౌకర్యం అంతరాయం ఏర్పడుచున్ననేపథ్యంలో ఇకపై ప్రతి రోజు ఉదయం 8 గంటలనుండి 12 గంటల వరకు మరియు సాయంత్రం నాలుగు గంటల నుండి 8 గంటల వరకు పట్టణంలోకి ఏ మార్గం గుండా అయినా లోడుతో ఉన్న భారీ వాహనాలు, లారీలు బాక్స్ టైపు కంటైనర్లు ట్రాక్టర్స్ రాకూడదని తీర్మానం చేయడమైనది. పశ్చిమ గోదావరి జిల్లా కేంద్రం భీమవరంలో అన్ని ప్రభుత్వ శాఖల ఆఫీసులు ఏర్పాటు చెయ్యడంతో దీనికి తోడు ప్రముఖమైన విద్యాసంస్థలు, హాస్పిటల్స్ మరియు వ్యాపార సముదాయాలు ఎక్కువగా ఉన్నాయి వీటి కారణంగా జిల్లా లోని అన్ని మార్గాల నుండి వేలాదిగా ప్రజల రాకపోకలు ఎక్కువగా ఉంటున్నాయి. కనుక పట్టణంలో ట్రాఫిక్ అంతరాయం ఏర్పడకుండా ఈ నిర్ణయం తీసుకొన్నారు. అలాగే పట్టణంలో నలుదిక్కుల నుండి ప్రముఖ సెంటర్ లలో సూచిక బోర్డులు ఏర్పాటు చెయ్యాలని తీర్మానించారు.
