సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: నరసాపురం లోకసభ వైసీపీ అభ్యర్థి గూడూరి ఉమాబాల నేడు, గురువారం తన ప్రచారంలో భాగం ఉండి నియోజకవర్గం లో పర్యటించారు. దీనిలో భాగంగా నేటి మధ్యాహ్నం ఉండి మండలం చెరుకువాడ గ్రామంలోని శ్రీ అలుగులమ్మ అమ్మవారి జాతర మహోత్సవంలో పాల్గొన్నారు, భర్త జగదీష్ మరియు స్థానిక ప్రజలు వైసీపీ నేతలతో కలసి ప్రత్యేక పూజలు నిర్వహించి అమ్మవారి ఆశీస్సులు తీసుకున్నారు. తన పర్యటనలో ఏ ప్రాంతానికి వెళ్లిన వాడవాడలా ప్రజలు తనను తమ ఆడబడుచుగా భావించి ఆత్మీయంగా తమ ఇండ్లకు ఆహ్వానిస్తున్నారని సీఎం జగన్ సంక్షేమాలు ఇంటిటికి చేరాయని ప్రజలు సంతోషంతో చెబుతున్నారని ఇదే తన అఖండ విజయాన్ని ఖాయం చేస్తుందని, తాను, స్థానిక వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థులు అధికారంలోకి వస్తే కేంద్ర ప్రభుత్వ నిధులతో ఇటు రాష్ట్ర ప్రభుత్వ సహకారంతో తన పరిధిలోని 7 నియోజకవర్గాల అభివృద్ధి కి కృషి చేస్తానని గూడూరి ఉమాబాల అన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *