సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: భీమవరం నియోజకవర్గంలో జనసేన అభ్యర్థిగా టీడీపీ , బీజేపీ మద్దతుతో బరిలో దిగుతున్న పులపర్తి రామాంజనేయులు (అంజిబాబు) నేడు, శుక్రవారం ఆయన కార్యాలయంలో మన సిగ్మా న్యూస్ తో ప్రత్యేకంగా మాట్లాడుతూ..తన అభిప్రాయాలు పంచుకోవటం జరిగింది.తాను భీమవరం నుండి పోటీ చేయడాన్ని టీడీపీ జనసేన బీజేపీ తో పాటు స్థానిక ప్రజలు కూడా హర్షిస్తున్నారని తన విజయం ఖాయంగా కనపడుతుంది అన్నారు. ఇక ప్రజల వద్దకి వెళ్లి ఇంటిటా ప్రచారం అతి త్వరలో ప్రారంభిస్తానని, ప్రస్తుతం నియోజకవర్గంలోని పలువురు పెద్దలను జనసేన, టీడీపీ బీజేపీ నేతలను సమన్వయ పరుచుకొంటున్నానని, పలు మీడియా వారి ఊహాగానాలకు విరుద్ధంగా అందరి నేతల వద్ద నుండి ఆయా పార్టీల క్యాడర్ నుండి కూడా పూర్తీ మద్దతు లభిస్తుందని అన్నారు. పవన్ కళ్యాణ్ సహకారం మరువలేనని ఈసారి గత 2019 ఎన్నికలలో పవన్ కళ్యాణ్ కు పడ్డ 62 వేలకు పైగా ఓట్లకు తోడుగా అదనంగా మరో 20 శాతం ఓట్లు పడి తనకు భారీ మెజారిటీ ఖాయం అని అన్నారు.ఒక ప్రశ్నకు సమాధానంగా భీమవరం నియోజకవర్గంలో ఉన్న 2 మండలాల్లో వీరవాసరం మండలం నుండి తనకు అనూహ్య మద్దతు వస్తున్నట్లు గమనించానని తెలిపారు. తమకు మద్దతుగా వైసీపీ నుండి ఎక్కువ మంది వలసలు వస్తున్నట్లు తెలిపారు. తాను అధికారంలోకి వచ్చాక నియోజకవర్గాన్ని అభివృద్ధిలో పరుగులు పెట్టిస్తానని ఆగిపోయిన వంతెనలు, వాటి అప్రోచ్ రోడ్డు నిర్మాణాలు పూర్తీ చేస్తానని, శాంతి భద్రతలకు ప్రధమ స్థానం ఇస్తానని సిగ్మా న్యూస్ కు తెలిపారు.
