సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: భీమవరం పురాధీశ్వరి శ్రీశ్రీశ్రీ మావుళ్ళమ్మవారిని నేటి శుక్రవారం ఉదయం దర్శించుకొని, ప్రత్యేక పూజలు నిర్వహించిన తదుపరి.. భీమవరం నియోజవర్గ వైసీపీ అభ్యర్థిగా పోటీ చేస్తున్న ఎమ్మెల్యే గ్రంధి శ్రీనివాస్ మరియు నరసాపురం పార్లమెంట్ వైసీపీ పార్టీ అభ్యర్ధినిగా పోటీ చేస్తున్న గూడూరి ఉమాబాల తమ ఎన్నికల ప్రచారంలో పాల్గోన్నారు. భారీ గా వైసిపి అభిమానులు స్థానిక నేతలు, MLC కవురు శ్రీనివాస్ వెంటరాగా ర్యాలీగా కాలినడకన తన కార్యాలయం నుండి శ్రీ మావుళ్ళమ్మవారి గుడి మరియు మారుతి సెంటర్ లోని శ్రీ దాసాంజనేయ స్వామిని దర్శించుకొని మరియు సుంకరపద్దయ్య వీధిల గుండా తమ ఎన్నికల ప్రచారం ప్రారంభించారు. రోడ్లపై వాహనదారులు వారితో కరచాలనం చెయ్యడానికి ప్రయత్నించడం వారిని వీరు ఓట్లను అభ్యర్ధించడం జరిగింది. ఇప్పటి వరకు కీలక నేతల మద్దతు కోసం ప్రచారం చేసినప్పటికీ నేటి నుండి మాత్రం ప్రజల ను ఇంటిటికి వెళ్లి తమ ప్రభుత్వ హయాంలో జరిగిన అభివృద్ధి ని, సంక్షేమాన్ని ప్రజలకు వివరిస్తూ ఎమ్మెల్యే అభ్యర్థి గ్రంధి శ్రీనివాస్ ఎంపీ అభ్యర్థి గూడూరి ఉమాబాల లు సంయుక్తంగా తమ ఎన్నికల ప్రచారంలో కీలక పర్వానికి నేడు, శ్రీకారం చుట్టారు.
