సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: ఈడీ వద్ద తగిన ఆధారాలు ఉన్నాయని సాక్షాతూ మద్యం కుంభకోణం లో ఢిల్లీ సీఎం కేజీ వాల్ ను గత రాత్రి అరెస్ట్ చెయ్యడంతో దేశం విస్తుపోయింది. అయితే ఢిల్లీ మద్యం కేసులో ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ తనను అరెస్టు చేయడాన్ని సవాల్ చేస్తూ, అరవింద్ కేజ్రీవాల్ సుప్రీంకోర్టులో పిటిషన్ వేసి స్వయంగా వాదించుకొంటానని చెప్పి తరువాత పరిణామాలలో నేడు, శుక్రవారం తన పిటిషన్ దాఖలును ఉపసంహరించుకున్నారు. మనీలాండరింగ్ విచారణకు సంబంధించి కేజ్రీవాల్ దాఖలు చేసిన వ్యాజ్యాన్ని విచారించేందుకు జస్టిస్ సంజీవ్ ఖన్నా నేతృత్వంలోని ప్రత్యేక సుప్రీంకోర్టు ధర్మాసనం అంగీకరించింది. ఈ విచారణ.. ట్రయల్ కోర్టులో రిమాండ్ ప్రొసీడింగ్స్‌తో క్లాష్ అవుతుందని సీఎం తరఫు న్యాయవాదులు అత్యున్నత న్యాయస్థానానికి తెలిపారు. అందువల్ల పిటిషన్‌ను ఉపసంహరించు కునేందుకు అనుమతించాలని కోరారు. మరోవైపు కేజ్రీవాల్ కుటుంబాన్ని గృహ నిర్బంధంలో ఉంచినట్లు ఆమ్ ఆద్మీ పార్టీ నేత, దిల్లీ మంత్రి గోపాల్ రాయ్ పేర్కొన్నారు.ఈ అరెస్ట్ ను ఖండిస్తూ కాంగ్రెస్ నేత రాహల్ గాంధీ , ఇండియా కూటమిలోని పలు పార్టీలునేతలు తమ నిరసన ను కేంద్రానికి తెలుపుతూ వ్యాఖ్యలు చేసారు. ఏది ఏమైనా నోట్లకు దూరంగా ప్రజాభిప్రాయం మేరకు ఓట్లు అనే నిజమైన ప్రజాస్వామ్య పద్దతిలో సంచలన విజయాలు నమోదు చేసిన క్రేజీ వాల్ ఈ విధంగా మద్యం కుంభకోణం లో ఇరుక్కోవడం దేశవ్యాప్తంగా హాట్ టాపిక్ అయ్యింది.
