సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: పశ్చిమ గోదావరి జిల్లాలో వచ్చే ఏప్రిల్‌ 5వ తేదీ నుంచి రైతుభరోసా కేంద్రాల ద్వారా ధాన్యం కొనుగోలు కు అధికారులు ఏర్పాటు చేస్తున్నట్లు సమాచారం.. 2023-24 రబీ సీజన్‌ ధాన్యం కొనుగోలు ప్రక్రియపై రైతులకు అవగాహన సదస్సు నిర్వహిస్తారు. గోనె సంచులు, లేబర్‌, ట్రాన్స్‌పోర్టు వాహనాల ను అధికారులు సిద్ధం చేస్తున్నారు. ధాన్యం సేకరణకు పంట నమోదు తప్పనిసరి అని, అలాగే ట్రాన్స్‌పోర్టు వాహనాలకు తప్పనిసరిగా జీపీఎస్‌ పరికరం అమర్చి ఉండాలన్నారు.రైతుల నుండి సేకరించిన గ్రేడు-ఎ రకం ధాన్యం రకానికి క్వింటాకు రూ.2203, కామన్‌ రకానికి క్వింటాకు రూ.2183 మద్దతు ధర చెల్లించడం జరుగుతుంది. .

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *