సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: రష్యా రాజధాని మాస్కో లోని క్రాకాస్ సిటీ కాన్సర్ట్ హాల్‌లో గత శుక్రవారం రాత్రి జరుగుతున్నా సంగీత విభావరి లో పాల్గొన్న పేక్షకులపై ఉగ్రవాదులు ఒక్కసారిగా.. విచక్షణ రహితంగా కాల్పుల ఘటనను 60 మంది పైగా మరణించడం, 150 మంది గాయపడటం పట్ల ప్రపంచ వ్యాప్తంగా పలు దేశాలతో పాటు భారత ప్రధాని నరేంద్ర మోదీ తీవ్రంగా ఖండించారు. ఈ దాడిని తామే చేసినట్లు ఇస్లామిక్ స్టేట్ సంస్థ ప్రకటించింది. భారత ప్రధాని మోదీ సోషల్ మీడియా ‘ఎక్స్’ వేదికగా ఈ మేరకు పేర్కొన్నారు. ”మాస్కోలో జరిగిన ఘోరమైన ఉగ్రవాద దాడిని మేము తీవ్రంగా ఖండిస్తున్నాము. ఈ విషాద సమయంలో భారతదేశం రష్యన్ ఫెడరేషన్ ప్రభుత్వానికి, అక్కడి ప్రజలకు సంఘీభావంగా, అండగా నిలుస్తుందని” ప్రకటించారు. మరోవైపు దీనిని “హేయమైన, పిరికి ఉగ్రవాద దాడి”గా ఐక్యరాజ్యసమితి భద్రతా మండలి పేర్కొంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *