సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: ఏపీలో టీడీపీ పార్టీ వచ్చే అసెంబ్లీ టికెట్స్ పంపిణి చివరి అంకంలోకి ప్రవేశించింది. పార్టీలో సుదీర్ఘ కాలం పనిచేసిన కష్ట కాలంలో పార్టీ కోసం పనిచేసిన డబ్బు హోదా ఉన్నవారికే నాన్ లోకల్ వారికే పలుచోట్ల టికెట్స్ ను అధినేత చంద్రబాబు కేటాయించారని పలువురు కీలక సీనియర్ నేతలు, వైసీపీ నుండి దూకి వచ్చిన నేతలు మీడియా ముందు మొరపెట్టుకొంటున్నారు. ఇదిలా ఉండగా కుటుంబానికి ఒక టికెట్ మించి అడగవద్దని చంద్రబాబు పార్టీలో సీనియర్ నేతలకు ముందే రూల్ పెట్టారు. అయితే చంద్రబాబు కుటుంబంలో చుస్తే లోకేష్, బాలయ్య, బాలకృష్ణ చిన్నల్లుడు తో కలపి 4 టికెట్స్ కేటాయించగా ఇప్పుడు ఆ రికార్డు ను యనమల సరిచేశారు. తాజాగా మాజీ మంత్రి యనమల రామకృష్ణుడు ఇంట్లో మొత్తం నలుగురిని పార్టీ అభ్యర్థులుగా ఎంపిక చెయ్యడం ఫై పార్టీలో ఆసక్తి కర చర్చ జరుగుతుంది. యనమల రామకృష్ణుడికి ఇప్పటికే ఎమ్మెల్సీ పదవి ఉండగా.. ఆయన వియ్యంకుడైన పుట్టా సుధాకర్ యాదవ్‌కు కడప జిల్లా మైదుకూరు అసెంబ్లీసీటు, యనమల అల్లుడు (సుధాకర్ యాదవ్ కుమారుడు) పుట్టా మహేశ్ యాదవ్‌కు ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలోని కీలకమైన ఏలూరు ఎం పీ సీటు ( ఇక్కడ స్థానిక బీజేపీ అభ్యర్థి గారపాటి చౌదరి ఎంత శ్రమ పడ్డప్పటికీ) కేటాయించారు. ఇక, యనమల కుమార్తె దివ్య కు తుని అసెంబ్లీ టికెట్ దక్కడం గమనార్హం..

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *