సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: భీమవరం పట్టణం జనసేనలో ఇటీవల చేరిన మాజీ వైసీపీ నేత గాదిరాజు సుబ్రమణ్య రాజు (తాతారాజు) ఆధ్వర్యంలో ఆయన సన్నిహితులు స్థానిక ,29,31,32 వార్డులోని పలువురు యువకులు ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా అధ్యక్షుడు కొటికలపూడి గోవిందరావు , భీమవరం అసెంబ్లీ కి పోటీ చేస్తున్న జనసేన పార్టీ ,టీడీపీ బీజేపీ కూటమి ఉమ్మడి అభ్యర్థి పులపర్తి రామాంజనేయులు సమక్షంలో జనసేన పార్టీలోకి లోకి చేరారని తెలిపారు.. ఈ సందర్భంగా అంజిబాబు మాట్లాడుతూ.. భీమవరం నియోజవర్గ అభివృద్దే లక్ష్యంగా పని చేస్తానని, ప్రశాంతమైన భీమవరం నియోజక వరాన్ని సాధించుకుందామని అంజిబాబు అన్నారు. జనసేన చినబాబు మాట్లాడుతూ.. జగన్ రాక్షస పాలన పోవాలంటే కూటమి అభ్యర్థులను గెలిపించాలని, గ్లాస్ గుర్తుకే ఓటు వేసి గెలిపించాలని అన్నారు. ఈ కార్యక్రమంలో పట్టణ అధ్యక్షులు చేనమల్ల చంద్ర శేఖర్,ప్రధాన కార్యదర్శి సుంకర రవి, జాయింట్ సెక్రటరీ బండి రమేష్ కుమార్,మాజీ కౌన్సిలర్స్ మాగపు ప్రసాద్ , వానపల్లి సూరిబాబు , పొన్నాడ సతీష్ , పామర్తి వెంకట్రామయ్య,తదితర నేతలు పాల్గొన్నారు. .అనంతరం రాయలం గ్రామములో ఏర్పాటు చేసిన అత్మీయ సమావేశంలో పాల్గొన్నారు .
