సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: సిట్టింగ్ ఎంపీ రఘురామా కృష్ణంరాజు ఎంత శ్రమ పడినప్పటికీ..తెలుగు రాష్ట్రాల ప్రజలు ఆసక్తిగా ఎదురుచూసిన ప్రతిష్టాకరమైన నరసాపురం లోక్‌సభ కూటమి అభ్యర్థిగా బీజేపీ పక్షాన రాష్ట్ర కార్యదర్శి, సీనియర్‌ నేత భూపతిరాజు శ్రీనివాస వర్మ అభ్యర్థిత్వాన్ని ఆదివారం రాత్రి అధికారికంగా ప్రకటించారు. ఈ స్థానం నుంచి పోటీకి భీమవరం నుండి సీనియర్ బీజేపీ నేతలు శ్రీనివాస వర్మ, పాకా సత్యనారాయణ తదితరులు దరఖాస్తు చేసుకున్నారు. చివరకు విద్యార్థి దశ నుండి ఏబీవీపీ లో పనిచేసి బీజేపీ సాధారణ కార్యకర్త నుంచి పలుమారులు ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా పార్టీ అధ్యక్షుడిగా, పార్టీ రాష్ట్ర కార్యదర్శిగా ఎదిగిన శ్రీనివాసవర్మకు అధిష్టానం సీటు ఖరారు చెయ్యడం పట్ల జిల్లా వ్యాప్తంగా బీజేపీ క్యాడర్ హర్షం వ్యక్తం చేస్తుంది. నిజానికి నర్సాపురం పార్లమెంట్ లో బీజేపీ అభ్యర్థులు కృష్ణంరాజు, గంగరాజు గతంలో 2 సార్లు విజయం సాధించడం లో వర్మ కృషి ప్రసంశనీయం.. 3 మారులు భీమవరం లోనే సమైక్య ఏపీ రాష్ట్ర బీజేపీ సమావేశాలు పెట్టడం, భీమవరం మునిసిపల్ కౌన్సిల్ లో మాజీ కౌన్సిలర్ గా ప్యానల్ స్పీకర్ గా పనిచేస్తూ 2014 నుండి కేంద్రం నుండి పేదలకు టిడికో గృహాలకు, అమృతా స్కీమ్ క్రింద కోట్ల రూపాయల నిధులు మంజూరు చేయించడంలో కూడా కేంద్ర మంత్రులతో తన పరిచయాలను ఉపయోగించి వర్మ భీమవరం అభివృద్ధి లో కీలక పాత్ర పోషించారు. ఈ సందర్బముగా వర్మ మన ‘సిగ్మా న్యూస్’ తో మాట్లాడుతూ.. బీజేపీ లో పనిచేసిన సాధారణ కార్యకర్తల అభిప్రాయానికి సమర్ధతకు గుర్తింపుకు ఇదే నిదర్శనమని, అందరిని కలుపుకుని పోవడం ద్వారా కచ్చితంగా నరసాపురం లోక్‌సభ స్థానం నుంచి గెలుపొందడం ఖాయమని భరోసా వ్యక్తం చేసారు. ఈ సందర్భంగా ప్రధాని మోదీ, పార్టీ జాతీయ అధ్యక్షుడు నడ్డా, అమిత్‌ షా, రాష్ట్ర అధ్యక్షురాలు పురందేశ్వరికి కృతజ్ఞతలు తెలిపారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *