సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: ఢిల్లీ మద్యం కేసులో అరెస్టయిన తెలంగాణ మాజీ సీఎం కెసిఆర్ కుమార్తె , ఎమ్మెల్సీ కవిత ఈడీ కస్టడీ నేటి మంగళవారంతో ముగిసింది. ఈ నేపథ్యంలో ఆమెను రౌజ్ అవెన్యూ కోర్టులో ఈడీ అధికారులు హాజరుపరిచారు. ఈడీ తరఫు న్యాయవాది జోయబ్ హుస్సేన్ కవితను 15 రోజుల జ్యుడిషియల్ కస్టడీకి పంపాలని కోరారు. ఇరువైపులా వాదనలు విన్న కోర్టు కవితకు 14 రోజుల జ్యుడిషియల్ రిమాండ్ విధిస్తూ ఉత్తర్వులు ఇచ్చింది. ఏప్రిల్ 9 వరకూ ఈ రిమాండ్ కొనసాగనుంది. దీంతో ఆమెను తీహార్ జైలుకు అధికారులు పంపుతున్నారు. మరోవైపు కవిత మధ్యంతర బెయిల్ పిటిషన్ వచ్చే ఏప్రిల్ 1న విచారణ చెపట్టనున్నట్లు కోర్టు
తెలిపింది.
