సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: కూటమిలో కీచులాటలు పుణ్యమా, అని వైసీపీ ఎవరు ఊహించని రీతిలో బలపడుతుంది. బీజేపీ కి ఉన్న బలమైన అభ్యర్థి గారపాటి చౌదరిని ప్రక్కన పెట్టడం టీడీపీ అభ్యర్థిగా రాయలసీమ కు చెందిన పుట్టా యాదవ్ ను బరిలోకి దించడంతో టీడీపీ, జనసేన, బీజేపీ పార్టీలలో నిరసనలు చినికి చినికి సునామిగా మారుతున్నాయి, టీడీపీ లోక్ సభ ఇంచార్జి గోపాల్ యాదవ్ తీవ్ర అసంతృప్తి తో సీఎం జగన్ గొప్పవాడు దమ్మున్నవాడు .. బిసి లకు ఆయనే మేలు చేసాడు అని పబ్లిక్ మెసేజ్ ఇవ్వడం తో పాటు తాజా సమాచారం ప్రకారం.. జిల్లాలో గౌరకుటుంబాలలో ఒకరిగా ఉన్న టీడీపీ మాజీ ఎంపీ, మాజీ మంత్రి మాగంటి బాబు తనను చంద్రబాబు ప్రక్కన పెట్టేసాడని తీవ్ర ఆవేదనతో వైసీపీ లో చేరిపోవడానికి హైదరాబాద్ లో వైసీపీ పెద్దలతో సమాలోచనలు చేస్తున్నట్లు సమాచారం.. చంద్రబాబు పొత్తులు మాట దేవుడు ఎరుగు .. ఏలూరులో పార్టీ నేతలు క్యాడర్ వలసలతో దెబ్బ తినేలా ఉంది దీనితో పరిస్థితులు పూర్తీ అనుకూలంగా మారిపోతుండటంతో.. వైసీపీ ఎంపీ అభ్యర్థి కారుమూరి సునీల్ కుమార్ యాదవ్. మీడియా తో మాట్లాడుతూ.. తాను భారీమెజారిటీ తో గెలవడం పక్కాని..సీఎం జగన్ కు ఏలూరు సిటు కానుకగా ఇస్తానని ధీమా వ్యక్తం చేశారు. ఏలూరు జిల్లాలో నాయకులు లేకే టీడీపీ కడప నుంచి అభ్యర్థి పుట్టా మహేశ్ యాదవ్ని తెచ్చుకుందన్నారు. వైసీపీ వ్యూహాలకు భయపడే టీడీపీ ఎన్నికల ముందే చేతులు ఎత్తేస్తుందని వ్యాఖ్యానించారు, నేను స్థానికుడిని..ఇక్కడి ప్రజలు, రైతుల కష్టాలను చిన్నప్పటి నుంచి చూస్తూ పెరిగినాను. ఏలూరులోనే కాదు రాష్ట్రం మొత్తం టీడీపీపై అసంతృప్తిగా ఉన్నారన్నారు.
