సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: విజయవాడ డివిజన్‌లో జరుగుతున్న రైల్వే ట్రాక్‌ల నిర్వహణ పనుల కారణంగా పలు రైళ్లను పూర్తిగా రద్దు చేసి , కొన్నింటిని పాక్షికంగా, మరికొన్నింటిని దారి మళ్లించి నడుపుతున్నారు. ప్రయాణికులు గమనించవలసిన మార్పులు: ఏప్రిల్‌ 1 నుంచి 28 వరకు మచిలీపట్నం–విశాఖపట్నం (17219), గుంటూరు–విశాఖపట్నం (22701/22702), ఏప్రిల్‌ 2 నుంచి 29 వరకు విశాఖపట్నం–మచిలీపట్నం (17220) రైళ్లను పూర్తిగా రద్దు చేశారు.అలాగే ఏప్రిల్‌ 1 నుంచి 28 వరకు మచిలీపట్నం – విజయవాడ (07896), విజయవాడ – మచిలీపట్నం (07769), నర్సాపూర్‌ – విజయవాడ (07863), విజయవాడ – నర్సాపూర్‌ (07866), మచిలీపట్న – విజయవాడ (07770), విజయవాడ – భీమవరం జంక్షన్‌ (07283), మచిలీపట్నం – విజయవాడ (07870), విజయవాడ – నర్సాపూర్‌ (07861) రైళ్లు విజయవాడ – రామవరప్పాడు మధ్య పాక్షికంగా రద్దు అయ్యాయి. ఏప్రిల్‌ 6, 13, 20, 27 తేదీల్లో హతియ – బెంగళూరు (18637), ఏప్రిల్‌ 2, 7, 9, 14, 16, 21, 23, 28 తేదీల్లో హతియ – బెంగళూరు (12835), ఏప్రిల్‌ 5, 12, 19, 26 తేదీల్లో టాటా – బెంగళూరు (12889) రైళ్లు వయా విజయవాడ, గుడివాడ, భీమవరం టౌన్, నిడదవోలు మీదుగా దారి మళ్లించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *