సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: పశ్చిమ గోదావరి జిల్లా తణుకు రూరల్ మం డలంలో ఎన్నికల ప్రచారంలో పాల్గొంటున్న పౌర సంబంధాల శాఖ మంత్రి కారుమూరి నాగేశ్వర రావు తాజాగా మీడియాతో మాట్లాడుతూ..చంద్రబాబుకు మద్దతుదారుడైన మాజీ ఈసి .. నిమ్మగడ్డ రమేష్, చేత ఎలక్షన్ కమిషన్కి లేఖ రాయించి.. ప్రజలకు ఇంటివద్దకు సంక్షేమం అందకుండా, అవ్వ తాతలకు పింఛనులు అందకుండా వాలంటీర్ల సేవలు నిలిపి వేయించిన నీచుడు, చంద్రబాబు అని ఆగ్రహం వ్యక్తం చేసారు. ఈ మాయల ఫకీర్ వేషాలు ప్రజలు అందరు గమనిస్తున్నారని అన్నారు. ప్రజలకు ఎవరు మేలు చేసిన చంద్రబాబుకి ద్వేషమే. ఎవరైనా ఏడుస్తుంటే చంద్రబాబు ఆనందిస్తాడు. ఎండలు మండుతున్నాయి. పెన్షన్ల కోసం అవ్వా తాతలు మళ్ళీ లైన్లో నిలబడి సొమ్మ సిల్లీ పడిపోతే చంద్రబాబుకి సంతోషం. ఎన్నికల కమిషన్ మరోసారి పునర్ పరిశీలించి వృద్దులకు పెంక్షన్స్ ఇచ్చేందుకు వాలంటీర్లు కు అవకాశం ఇవ్వాలని విజ్ఞప్తి చేస్తామన్నారు. ఈసారి ఎన్నికలలో చంద్రబాబు నీచ బుద్ధిని గమనించి బుద్ధి చెప్పేందుకు ప్రజలు మరోసారి సిద్ధం గా ఉన్నారని చెప్పారు.
