సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: నరసాపురం బీజేపీ MPఅభ్యర్థిగా బరిలో నిలచిన శ్రీనివాస వర్మ గత శనివారం పాలకొల్లు లోని ఎస్ కన్వర్షన్ హాలు లో టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు తో స్థానిక జిల్లా బీజేపీ నేతలతో కలసి కొద్దీ సేపు సమావేశం అయ్యారు. చంద్రబాబు ఎన్నికల ప్రచారంలో భాగంగా పాలకొల్లు నర్సాపురం బహిరంగ సభలో ఎంపీ అభ్యర్థిగా తనను టీడీపీ క్యాడర్ కు పరిచయం చేసి ఓట్లు వెయ్యవలసినదిగా బహిరంగంగా అభ్యర్ధించినందుకు శ్రీనివాస్ వర్మ ఆయనకు కృతజ్ఞతలు తెలిపారు. టీడీపీ జనసేన బీజేపీ కూటమి ఎప్పుడు మంచి ఫలితాలనే సాధించిందని మరోసారి అదే రిపీట్ అవుతుందని ..35 ఏళ్లుగా ఒకే పార్టీ బీజేపీ ని నమ్ముకొని కార్యకర్తగా ఆ పార్టీ బలోపేతానికి కృషి చేస్తూ ఇప్పుడు కూటమి ఎంపీ అభ్యర్థిగా బరిలో దిగుతున్న శ్రీనివాస వర్మకు జిల్లా బీజేపీ సభ్యులకు చంద్రబాబు అబినందనలు తెలిపారు. కూటమి అభ్యర్థులు విజయానికి అందరు సమిష్టిగా పనిచేయాలి అని పేర్కొన్నారు.
