సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: టీడీపీ అధినేత, చంద్రబాబు, జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌ ఉమ్మడిగాఇకపై గోదావరి జిల్లాలలోతొలిసారి రోడ్‌ షో లు నిర్వహించనున్నారు. తూర్పుగోదావరి జిల్లాలో తొలిసారి ఒకే కాన్వాయ్ వేదికపై చంద్రబాబు, పవన్‌ కనిపించనున్నారు. నిడదవోలులో ఈ నెల 10న బుధవారం ఉదయం రోడ్‌ షో, బహిరంగ సభ నిర్వహించనున్నారు. అదే బుధవారం సాయంత్రం నాలుగు గంటలకు తణుకులో స్థానిక టీడీపీ అభ్యర్థి ఆరిమిల్లి రాధాకృష్ణతో కలసి రోడ్‌ షో నిర్వహిస్తారు. అనంతరం రోడ్‌ మార్గాన సాయంత్రం ఏడు గంటలకు నిడదవోలులో రోడ్‌షో నిర్వహించనున్నారు. ఈ నేపథ్యంలో నిడదవోలు కూటమి అభ్యర్థి కందుల దుర్గేష్‌, టీడీపీ మాజీ ఎమ్మెల్యే బూరుగుపల్లి శేషారావు ఏర్పాట్లు చేస్తున్నారు.11వ తేదీన పి.గన్నవరం, అమలాపురం నియోజకవర్గాల్లో ఉమ్మడిగా రోడ్‌షో,సభ లలో పాల్గొంటారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *