సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: విజయవాడ పశ్చిమ నియోజకవర్గంలో బీజేపీ అభ్యర్థి సుజనా చౌదరికి సీటు కేటాయించడంతో… జనసేన ను బలోపేతం చేసిన పోతిన వెంకట మహేష్ నేడు, సోమవారం జనసేన పార్టీకి , పదవులకు రాజీనామా చేశారు. ఈ సమయంలో జనసేన (అధినేత పవన్ కళ్యాణ్‌పై తీవ్ర స్థాయి విమర్శలు గుప్పించారు. తెలుగుదేశం – జనసేన – బీజేపీ పొత్తులో భాగంగా తమ పార్టీకి పవన్ ను నమ్ముకున్న జనసైనికులను, వారి కుటుంబాలను సర్వనాశనం చేసారని ఆరోపించారు. పవన్ చూపులో ద్వంద అర్ధాలు ఉంటాయి. ఇటువంటి వాడి స్వార్ధం కోసం మాలాంటి వారు బలయ్యారు. పొత్తులో భాగంగా పవన్ కళ్యాణ్ తీసుకున్న 21 సీట్లపై కాపులు ఎవరూ సంతృప్తిగా లేరని, తన స్వార్ధం కోసం ఏపీలో కులాల మధ్య పవన్ కళ్యాణ్ చిచ్చు పెడుతున్నారని మండిపడ్డారు. ఉన్న 21 స్థానాలలో కూడా టీడీపీ నుండి వచ్చిన వారికీ జనసేన కండువా కప్పి సీట్లు కేటాయించడం ఇన్నాళ్లు పార్టీ జెండా మోసి అష్ట కష్టాలు పడ్డ జనసేన క్యాడర్ ను అవమానించడమేనని అన్నారు. బీసీ సామాజిక వర్గం నుంచి నర్సాపురం అసెంబ్లీ సీటును బొమ్మిడి నాయకర్ ఒక్కరికే కేటాయించారన్నారు. మిగతా నేతలు ఏం పాపం చేశారని టికెట్లు ఇవ్వలేదని ప్రశ్నించారు. కాపులు, బీసీల మధ్య చిచ్చు పెట్టేలా పవన్ కుట్ర పన్నారని ధ్వజమెత్తారు. గతంలో భీమవరం నుంచి పవన్ పోటీ చేశారని.. ఓడిపోయారని, కానీ ఈసారి గెలుస్తారని రిపోర్ట్ ఉన్నప్పటికీ అక్కడ పోటీకి సిద్దమై కూడా అనూహ్యంగా భీమవరం సీటును అక్కడ బలంగా లేని టీడీపీ అభ్యర్థి అంజిబాబు కు ఎందుకు కేటాయించారో? చెప్పాలని భీమవరంలో జనసేనలో స్థానిక నేతలకు కేటాయిస్తే సంతోషించేవారని, గెలిచే సీటు వదులుకొని తన సీటును పిఠాపురానికి పవన్ ఎందుకు మార్చుకున్నారని నిలదీశారు. భీమవరంలో వైసీపీ ఎమ్మెల్యే, తనను సొంత ఇల్లు కట్టుకోనివట్లేదని, భయపెడుతున్నారని పవన్ చెప్పడం పచ్చి అబద్ధమని పోతిన వెంకట మహేష్ మండిపడ్డారు. జనసేన నేత నాగబాబుకు ఇచ్చిన అనకాపల్లి సీటును పవన్ ఎందుకు వదులుకున్నారని నిలదీశారు. ఆ ప్రాంతంలో స్థానిక కంపెనీల నుంచి డబ్బులు వసూల్ చేయలేదా ?అని నిలదీశారు. నిజానికి జనసేన మా అభిమానుల కష్టంతో నిలబడింది. మీరు పార్టీ కోసం చేసింది ఏమిటి? మనోహర్ లాంటి అసమర్థునికి పార్టీలో కీలక బాధ్యతలు అప్పగించి తమ లాంటి నేతల జీవితాలను నాశనం చేశారని ధ్వజమెత్తారు. ఇకపై ఎవరు మోసపోవద్దు అది త్వరలో టీడీపీ లో విలీనం కాబోతుందనిఅని పోతిన మహేష్ పిలుపునిచ్చారు.
