సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: భీమవరం మునిసిపల్ కమిషనర్, తాజా ప్రకటనలో ఈ విధంగా తెలియజేస్తున్నారు. 2024-25 ఏడాది ముందస్తు ఆస్థి పన్ను చెల్లింపుపై 5శాతం రాయితీ ఇస్తూ నేడు, సోమవారం ప్రభుత్వ ఉత్తర్వులు ఇవ్వడం జరిగింది…ఈనెల 30 లోపు మొత్తం పన్ను ఒకేసారి చెల్లించిన వారికీ 5% పన్ను రాయితీ అమలు అవుతుంది. మీ పన్ను చెల్లింపులు పురపాలక సంఘ కార్యాలయంలో గాని సచివాలయ వద్ద గాని లేదా ఆన్లైన్లో cdma.ap.gov.in వెబ్సైట్ ద్వారా గాని చెల్లించవచ్చు ….పన్ను చెల్లింపుదార్లు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవలసినదిగా కోరడమైనది.పన్నులు చెల్లించి పురపాలక సంఘ అభివృద్ధికి దోహద పడవలసినదిగా పట్టణ ప్రజలను కోరుతున్నారు.
