సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: ముగ్గురు మెగా అన్నదమ్ములు, చిరంజీవి, నాగబాబు, పవన్ కళ్యాణ్ నేడు, సోమవారం చిరంజీవి ‘విశ్వంభర’ సినిమా షూటింగ్ సెట్స్ లో కలిశారు. ఈ సందర్భంగా మెగాస్టార్ చిరంజీవి తన తమ్ముడిని ఆశీర్వదించారు. ‘జనసేనకు విజయోస్తు, విజయీభవ’ అని చిరంజీవి తమ కుటుంబ ఇలవేలుపు అంజనీపుత్రుడి పాదాల చెంత జనసేన పార్టీ అధ్యక్షులు, తన తమ్ముడైన పవన్ కళ్యాణ్ ని ఆశీర్వదించారు. జనసేన ఎన్నికల నిర్వహణ కోసం ఐదుకోట్ల రూపాయల విరాళాన్ని చెక్కు రూపంలో అందించారు. పవన్ కళ్యాణ్ ఎంతో ఉద్వేగానికి లోనయ్యారు. ఆలింగనం చేసుకున్న తరువాత పవన్ కళ్యాణ్ అన్నయ్య చిరంజీవి పాదాలకు నమస్కరించారు. పార్టీ స్థాపించి పదేళ్లు పూర్తవుతున్న తరుణంలోఎన్నికలు జరుగుతున్నా వేళా .. చిరంజీవి కూడా పవన్ వెనుకే ఉన్నారు అన్న భరోసా జనసేన కు కూటమి పార్టీలకు లభించింది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *