సిగ్మా తెలుగు డాట్, ఇన్ న్యూస్: భీమవరం పట్టణంలో క్రోది నామ సంవత్సరము ఉగాది సందర్బముగా పుష్ప మాలలతో సర్వసుందరంగా అలంకరించిన పురాధీశ్వరి శ్రీశ్రీ శ్రీ మావుళ్ళమ్మ అమ్మవారి ఆలయం నందు ఆలయ ప్రధాన అర్చకులు మద్దిరాల మల్లికార్జున శర్మ చే విశేష పూజలు, అంతరం తెలుగు వారి సంప్రదాయం ప్రకారం వేద పండితులచే పంచాంగ పఠనం కార్యక్రమములు నిర్వహించారు. మహా శక్తి స్వరూపిణి శ్రీ అమ్మవారి దయతో భక్తులకు ప్రజలకు సర్వ శుభాలు జరగాలని ప్రార్ధించారు. ఆలయ పండితులకు ఉగాది పురస్కారం అందచేసియున్నారు. ఈ కార్యక్రమమునకు విచ్చేసిన భక్తులకు ఆలయ సహాయ కమీషనర్ బి. యల్. నగేష్ 2024 -25 సం.రం. పంచాంగములు, ప్రసాదం అందచేసారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *