సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: నేడు, బుధవారం తణుకులో జనసేన అధినేత పవన్ కళ్యాణ్‌తో కలిసి బాబు ఎన్నికల ప్రచారం నిర్వహించారు. వీరితో పాటు స్థానిక టీడీపీ అభ్యర్థి ఆరిమిల్లి రాధాకృష్ణ , బీజేపీ ఎంపీ అభ్యర్థి శ్రీనివాస వర్మ కూడా వేదికను పంచుకొన్నారు. ఈ సందర్భంగా చంద్రబాబు మాట్లాడుతూ..రానున్న ఎన్నికల్లో వైసీపీని, జగన్‌ని భూస్థాపితం చేసి.. రాష్ట్రంలో చీకట్లను పారదోలుతామని ప్రకటించారు. నాకు అనుభవం ఉంది.. పవన్ కళ్యాణ్ కు పవర్ ఉంది. రాష్ట్రంలో అగ్నికి వాయువు తోడైంది. రాష్ట్రానికి ఇక అన్నీ మంచి రోజులే. రాష్ట్రాన్ని కాపాడుకోవడానికి మూడు పార్టీలు కలిశాయి. జెండాలు వేరైనా.. అజెండా ఒక్కటే. జగన్ ను భూస్థాపితం చేయడమే ప్రధాన లక్ష్యం. చీకటి పాలనను అంతం చేయడానికి ఓట్లు చీలకూడదని చెప్పిన మొదటి వ్యక్తి పవన్ కళ్యాణ్. యువత కన్నెర్ర చేస్తే జగన్ లండన్ కు పారిపోతాడు. 2014 నుంచి 2019వరకు ఏం జరిగిందో అర్దం చేసుకోండి. ఇప్పుడు ఏం జరుగుతుందో తెలుసుకోండి. ఎన్నికల్లో గెలవడానికి జగన్ ముద్దులు పెట్టారు. హగ్గులిచ్చారు. ఇప్పుడు పిడి గుద్దులు కురిపిస్తున్నారు. ఏపీలోని ప్రతి పౌరుడిని అడుగుతున్నా. అభివృద్ధి కావాలా? సంక్షోభం కావాలా.. నిర్ణయించుకోండి. దగా పథకాలు కావాలా, దోపిడి లేని పథకాలు కావాలో మహిళలు ఆలోచించాలి. ఇక్కడ ఉన్న ఎమ్మెల్యే పౌరసరఫరాల శాఖ మంత్రి కారుమూరి నాగేశ్వరరావు వంటి ముదురు ను నా రాజకీయ జీవితంలో చూడలేదు.. అంత తెలివిగా కోట్ల రూపాయల అవినీతి చేస్తాడు. రైతులకు కనీసం గోనెసంచులు ఇవ్వలేని స్థితిలో ఉన్నారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే మెగా డీఎస్సీ ఫైలుపై మొదటి సంతకం పెడతాం. పేదల ఆస్తులు దొంగిలించిన ఏకైక నాయకుడు జగన్. జగన్ వస్తున్నాడంటే పారిశ్రామిక వేత్తలు పారిపోతారు. నేను వస్తున్నానంటే, పారిశ్రామిక వేత్తలు తరలివస్తారు” అని బాబు అన్నారు.
