సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: భీమవరం పంచారామ క్షేత్రంలో ఇటీవల జరిగిన కార్తీక మాసంలో భక్తుల కోసం ఆలయ ఆవరణలో చలువ పందిళ్ళలో దాతల సహకారంతో జరిగిన నిత్యానదాన్నం కు విశేష స్వాందన వచ్చిన విషయం అందరికి తెలిసిందే. దీనికోసం నియమించిన కార్తీక మాస అన్నసమారాధన కమిటీ సభ్యులు నేడు, బుధవారం దేవాలయ ఇఓ డీ . రామకృష్ణంరాజు ను కలసి అన్నసమారాధన నిర్వహణ చెల్లింపుల ఖర్చులకు సంబందించిన లెక్కలు అప్పగించి మిగులు 2లక్షల 47 రూపాయల ఆదాయం ను దేవాలయానికి అందజెయ్యడం జరిగిందని తెలిపారు. అలాగే దేవాలయం రధం రక్షణ పర్యవేక్షణ కోసం కొత్త సీసీ కెమెరాలను ఏర్పాటు చెయ్యడం జరిగిందని ఇఓ సిగ్మాన్యూస్ కు తెలపడం జరిగింది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *