సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: వైఎస్ఆర్సీపీ ఎంపీ అభ్యర్దిని ,గూడూరి ఉమాబాల నేడు, శుక్రవారం సాయంత్రం భీమవరం 2 టౌన్, వంశీకృష్ణ నగర్ లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎన్నికల శిభిరం ప్రారంభోత్సవ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో స్థానిక ఎమ్మెల్యే గ్రంధి శ్రీనివాస్ తనయుడు గ్రంధి రవితేజ, గోకరాజు రామరాజు, తోట బోగయ్య , ఏయస్ రాజు , అభిరుచి రఘు , కామన నాగేశ్వరరావు మరియు ఇతర నాయకులు, కార్యకర్తలు,తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భముగా ఉమాబాల మాట్లాడుతూ.. సీఎం జగన్ సంక్షేమ పధకాలు ప్రజలకు ఎంతటి చోదోడు వాదోడు గా నిలిచాయో? తనకు ఎన్నికల ప్రచారంలో ఎక్కడ చుసిన ప్రజలు బ్రహ్మరధం పడుతున్నప్పుడే అర్ధం అయిందని, తనను కలసిన మహిళలు ఆనందంతో వారే స్వయంగా తమ కుటుంబాలకు జరిగిన మేలు, తమ ప్రాంతాల్లో జరిగిన అభివృద్ధి వివరిస్తున్నారని, తనను ఒక సోదరిలా భావించి తన విజయం కోసం అన్ని విధాలా సహకరిస్తున్న వైసీపీ శ్రేణులకు కృతజ్నతలు తెలుపుతున్నానన్నారు. తాను ఎంపీగా గెలిచాక ఈ ప్రాంత అభివృద్ధి కి, ముఖ్యంగా మహిళల కోసం శక్తి మేరకు కృషి చేస్తానని అన్నారు.
