సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: పశ్చిమ గోదావరి జిల్లాల వై.యస్.ఆర్ కాంగ్రెస్ పార్టీ MLA అభ్యర్థులతో, స్థానిక ఎమ్మెల్యే గ్రంధి శ్రీనివాస్, ఎంపీ అభ్యర్థి గూడూరి ఉమాబాల మరియు మంత్రులు కొట్టు సత్యనారాయణ, కారుమూరి నాగేశ్వరరావులతో గత రాత్రి జిల్లా రీజినల్ కోఆర్డినేటర్, ఎంపీ, పి మిధున్ రెడ్డి సమీక్షా సమావేశం నిర్వహించి.. ఎన్నికల ప్రచారం ఎలా జరుగుతుంది? ప్రజా స్వాందన ఎలా ఉంటుంది? ఇంకా ప్రచారంలో దూకుడు కు చేపట్టవలసిన కొత్త అంశాలు ఫై చర్చించారు. భీమవరం ఎమ్మెల్యే గ్రంధి శ్రీనివాస్, ఎంపీ అభ్యర్థి గూడూరి ఉమాబాల లను ప్రత్యేకంగా ఉద్దేశించి, రాష్ట్ర వ్యాప్తంగా ఇక్కడ మీపై మంచి రిపోర్ట్ వస్తుందని.. మీరు గతంలో ఈ ప్రాంతంలో ఏ అభ్యర్ధికి రాని భారీ మెజారిటీలపై ద్రుష్టి పెట్టాలని ఉత్సహపరిచారు.. ఈనెల 15వ తేదీన సీఎం జగన్ భీమవరంతో పాటు అదే రోజు సాయంత్రం తాడేపల్లి గూడెంలో బహిరంగ సభ ను తదుపరి మొత్తం జిల్లా పర్యటన విజయవంతం చెయ్యాలని శ్రేణులకు పిలుపు నిచ్చారు. అనంతరం పశ్చిమగోదావరి జిల్లా మేమంతా సిద్ధం బస్సు యాత్ర పోస్టర్ ను ఎమ్మెల్యే, గ్రంధి శ్రీనివాస్ తో పాటు మిథున్ రెడ్డి జిల్లా ఎమ్మెల్యేలు సంయుక్తంగా విడుదల చేసారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *