సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: మావోయిస్టు సెంట్రల్‌ రీజినల్‌ బ్యూరోఅధికార ప్రతినిధి ఓ కీలక ప్రకటన చేశారు. ఈ ఏడాది 50 మంది మావోయిస్టులు మృతి చెందారని వారి మృతికి నిరసనగా నేడు సోమవారం తెలుగు రాష్ట్రాలతో పాటు ఛత్తీస్‌ గడ్‌, ఒడిశా, మహారాష్ట్ర… వంటి ఐదు రాష్ట్రాలకు బంద్‌ కు పిలుపునిచ్చినట్లు మావోయిస్ట్ అధికార ప్రతినిధి జగన్‌ అనే పేరుతో ఓ లేఖను విడుదల చేశారు.ఈ బంద్ ప్రభావం ఏజెన్సీ ప్రాంతాలలో కొంత మేర ఉండే అవకాశం ఉంది. ఈ నెల 6న తెలంగాణ, చత్తీస్‌గడ్‌ బార్డర్‌ లో ఎన్‌ కౌంటర్‌ లో ముగ్గురు మావోయిస్టులు మృతి చెందారు. ఈ హత్యలను కాంగ్రెస్‌ ప్రభుత్వం చేసిన హత్యాకాండలు నరహంతక దాడిగా పేర్కొన్నారు. ఈ హత్యలకు తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి కారణమని ఆరోపించిన మావోయిస్టులు, ములుగు జిల్లా వెంకటాపురం మండలం పిట్టపాడ వద్ద గ్రేహౌండ్స్ పోలీసులు ఏకపక్ష కాల్పులు జరిపారని ఆరోపించారు. ములుగు జిల్లా వెంకటాపురం మండలానికి ఛత్తీస్గడ్ రాష్ట్రం నుండి కూలీ పనులకు వచ్చిన కూలీలను బెదిరించి కొరియర్లుగా మార్చుకొని వారి సమాచారం తో ముగ్గురు కామ్రేడ్లని ఎన్కౌంటుర్ పేరుతో హత్యచేసారని జగన్ లేఖలో పేర్కొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *