సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: భీమవరం పట్టణం 3 టౌన్ లోని నరసయ్య అగ్రహారంలో ప్రసిద్ధి చెందిన గ్రామ దేవత శ్రీ పుంతలో ముసలమ్మ వారం రోజుల ఉత్సవాలు ముగింపు సందర్భంగా నేడు, సోమవారం అఖండ అన్న సమారాధన నిర్వహించారు. ఈ అన్న సమారాధనను నరసాపురం పార్లమెంట్ బీజేపీ ఉమ్మడి అభ్యర్థి భూపతి రాజు శ్రీనివాస వర్మ ప్రారంభించారు.. అమ్మవారి ఉత్సవాలను ఏటా సంబరంగా నిర్వహించడాన్ని ఆయన నిర్వాహకులను అభినందించారు. ప్రతిఏటా జరిగే ఉత్సవాలలో తాను అమ్మవారి పూజలో పాల్గొంటానని, శ్రీనివాస్ వర్మ తెలిపారు. ఇదే ప్రాంతానికి చెందిన వర్మ జరగనున్న ఎన్నికలలో పార్లమెంటు సభ్యుడు కావాలని ఆకాంక్షించారు. ఆలయ కమిటీ తరఫున నరసరా అగ్రహారం ప్రాంతవాసులు అండగా ఉంటామని శ్రీనివాస్ వర్మకు హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ అధ్యక్షుడు వేపాడ సత్యనారాయణ, వేపాడ మావుళ్ళు, మల్లువలస హనుమంతురావు, మల్లువలసమావుళ్ళు తదితరులు పాల్గొన్నారు.అనంతరం శ్రీనివాస్ వర్మ డిఎన్ఆర్ కళాశాల సెక్రటరీ గాదిరాజు బాబు దంపతులను కలిసి ఆశీర్వాదం పొందారు. అలాగే ఉప కార్యదర్శి కొత్తపల్లి శివరామరాజును కలిశారు.. బ్యాంక్ కాలనీలోని న్యాయవాది సిరిగినీడి శ్రీనివాసరావు కుటుంబ సభ్యులను కలసి వారి మద్దతు ను అభ్యర్ధించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *