సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: ఇటీవల బంగారం, వెండి రేట్లు రికార్డుల మీద రికార్డులు బ్రేక్ చేస్తున్నాయి. బంగారం ధర మరోసారి నేడు, మంగళవారం ఆల్ టైం రికార్డుకు చేరింది. 10గ్రాముల బంగారం ధర రూ. 75వేల మార్క్ ను దాటింది. ఇటీవల అమెరికాలో వెలువడిన ద్రవ్వోల్బణ గణాంకాలు ఆశించిన స్థాయిలో ఉన్నాయి. మరోవైపు ఇరాన్ – ఇజ్రాయెల్ మధ్య యుద్ధ మేఘాల వేళ పసిడి ధరలు మరింత పెరిగే అవకాశం ఉందని నిపుణులు చెబుతున్నారు. తాజాగా బంగారం ధరల దూకుడును చూస్తుంటే ఈ ఏడాది చివరి నాటికి 10గ్రాముల బంగారం రూ.లక్ష దాటే అవకాశాలుకూడా ఉన్నట్లు కనిపిస్తుంది. ఇవాళ బంగారం, వెండి ధరలను పరిశీలిస్తే.. బంగారం ధర భారీగా పెరిగింది. 10గ్రాముల 24 క్యారెట్ల బంగారంపై రూ. 980 పెరిగింది. వెండిధరసైతం భారీగా పెరిగింది. కిలో వెండిపై రూ. వెయ్యి పెరగ్గా.. కిలో వెండి ధర రూ. 90వేలు దాటింది.తెలుగు రాష్ట్రాల్లో బంగారం ధర ఉదయం నేడు, మంగళవారం నమోదైన వివరాల ప్రకారం.. హైదరాబాద్, విజయవాడ, విశాఖప‌ట్ట‌ణంలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.67,950 మార్క్ కు చేరింది. 10గ్రాముల 24 క్యారెట్ల గోల్డ్ ధర రూ. 74,130 మార్క్ కు చేరింది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *