సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: భీమవరం లో లక్షమంది పైగా పాల్గొన్న బహిరంగ సభలో సీఎం జగన్ ప్రసంగం గతానికి బిన్నంగా కొత్త పుంతలు త్రోకింది. ప్రతిపక్ష నేతలపై నవ్వుతూనే తిరుగులేని ప్రశ్నలు సంధించారు. చంద్రబాబు, పవన్ లపై గతంలో ఎన్నడూ లేని విధంగా విరుచుకు పడ్డారు. జగన్ మాట్లాడుతూ.. తనపై జరిగిన దాడిని పేదల సంక్షేమం ఫై కక్ష కట్టిన నేతలు జరిపిన దాడిగా అభివర్ణించారు. . రొయ్యకు మీసం .. చం ద్రబాబుకు మోసం పుట్టుకతోనే వస్తాయి.. రాజకీయ జీవితంలో పేదలకు ఒక్క మంచి చెయ్యని, ఒక్క ప్రాజెక్టు , ఒక మెడికల్ కళాశాల, ఒక హార్బర్, ఒక్క విమాన ఆశయం కూడా కట్టని , ఒక చీటర్.. ఒక మోసగాడు.. మాయలోడు.. అనదగిన చం ద్రబాబు... సిగ్గులేకుండా అభివృద్ధి కి బ్రాండ్ అని తన పచ్చ మీడియా జాకీలతో బుల్ డ్రోజర్ లతో ఎత్తించి ప్రచారం చేసుకొంటాడు. ఈ డెబ్బై ఐదేళ్ల వయసొచ్చి నా బుద్దిరాని చంద్రబాబు నామీద రాళ్లు వేయాలని,అంతమొందించాలని వారి వర్గానికి బహిరంగంగా పిలుపునిస్తున్నారు. అభివృద్ధి అంటే మన ప్రజా ప్రభుత్వం.. అవినీతికి తావు లేకుండా పేదలందరి అకౌంట్లలో 2న్నర లక్షల రూపాయలు పైగా జమా చేసాం. వేలాది సచివాలయాలు, వాలంటీర్ వ్యవస్థ, యువతకు ఉద్యొగాలు , ఫిషింగ్ హార్బర్ లు , 17 మెడికల్ కళాశాలలు , విమానాశ్రయాలు నిర్మాణం ఎన్నో 58 నెలల కాలంలోనే పూర్తీ చేస్తున్నం.. టీడీపీ జనసేన , బీజేపీ , కాంగ్రెస్ ,పచ్చమీడియా, పెద్దరికం ముసుగులో మరి కొందరు వ్యక్తులు అందరు కలసి పేదలకు మంచి చేస్తున్న మీ బిడ్డ జగన్ పైకి యుద్దానికి వస్తున్నారని, వారు వేసే బాణాలు ప్రజల భవిషత్తు కు తగులుతాయని, వారికీ ఓటేస్తే పేదలకు ఇచ్చే పథకాలన్నీ కూడా మునిగిపోతాయని అన్నారు.చం ద్రబాబుకు నాపై కోపం ఎక్కు వ. నాకేదో అయిపోవాలని శాపనార్థాలు పెడుతున్నాడు . ఇక నాలుగేళ్లకొకసారి కార్లు మార్చినట్లు దత్తపుత్రుడు భార్య లను మార్చే దత్తపుత్రుడు కి ఇటీవల నా మీద కోపం తో బీపీ పెరిగిపోతుంది. బిగ్గరగా అరుస్తాడు, కాలు ఎత్తుతాడు, తల త్రిప్పుతాడు, అన్ని ఉపేస్తాడు .. దత్తపుత్రా.. ఆడవాళ్ల జీవితాలను నాశనం చేయడం , చులకనగా చూడటం తప్పు కాదా? ఇదేం అన్యా యం? అని అడిగితే చంద్రబాబు వదినకు కూడా కోపం వస్తుంది. ఇటువంటి వారందరు నాపై కి దాడి కి వచ్చిన భయం లేదు.. ఎందుకంటే నా వద్ద కోట్లాది ప్రజా బలం ఉంది. పేదల సైన్యం ఉంది.. వారి దీవెనలు వీరి కుట్రల నుండి నన్ను రక్షిస్తున్నాయి. వచ్చే ఎన్నికలలో ఏమి చెయ్యాలో వారికీ తెలుసు అంటూ సీఎం జగన్ తన ధీమా వ్యక్తం చేసారు.
