సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: శ్రీ రామ నవమి పర్వదినం సందర్భంగా నేడు, బుధవారం ప్రపంచ వ్యాప్తంగా శ్రీరామచంద్రుని భక్తులు వేడుకలు జరుపుకొంటున్నారు. అయితే అందరి ద్రుష్టి 400 ఏళ్ళ తరువాత ఇటీవల పునర్నిర్మాణం అయిన అయోధ్య రామాలయం మీదనే.. వారి ఆకాంక్షలు ను రెట్టింపు చేస్తూ నేడు, శ్రీ బాల రాముడి నుదుటన సూర్య కిరణాలు ప్రసరించాయి. గుడి మూడో అంతస్తు నుంచి గర్భగుడిలోని సూర్య తిలకం ప్రదర్శనకు ఏర్పాట్లు చేశారు. ఆలయ నిర్మాణంలోనే గమ్మతుగా ప్రత్యేక అద్దాలను అమర్చి శాస్త్రవేత్తల సహకారంతో ప్రతి ఏడాది శ్రీరామనవమి రోజు బాలరాముడి విగ్రహం నుదుట కిరణాలతో తిలకం ఏర్పాటు చేయడమే సూర్య తిలక్ ముఖ్య ఉద్దేశం. చైత్రమాసంలో సాక్షాత్కరించే ఈ అద్భుత దృశ్యం నేటి, మధ్యాహ్నం 12.15 నిమిషాలకు ఆవిష్కృతమైంది. మూడున్నర నిమిషాలపాటు సూర్య తిలకం 58 మి.మీ.ల పరిమాణంలో కనిపించి భక్తులకు కనువిందు చేసింది.రెండు నిమిషాలు పూర్తిస్థాయిలో తిలకంలా కనిపించింది. అంటే బాల రాముడి నుదుటిని సూర్యుడు ముద్దాడాడన్నమాట. సూర్య అభిషేకం, సూర్య తిలకంగా పిలుస్తున్న ఈ అద్భుత దృశ్యాన్ని కనులారా చూసేందుకు అయోధ్య రాములోరి ఆలయానికి భక్తులు లక్షల సంఖ్యలో తరలివచ్చారు. అపూర్వ దృశ్యాన్ని చూసి భక్తులు తన్మయత్వం చెందారు. అయోధ్యలో లక్షలాది భక్తుల కోలాహలం వారికీ చేసిన ఏర్పాట్లు అపూర్వమ్ అంటున్నారు.
