సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: జాతీయ స్థాయిలో జరిగిన సివిల్స్ పరీక్ష ఫలితాలలో పశ్చిమ గోదావరి జిల్లాలోని భీమవరం పట్టణానికి 7 కిలో మీటర్లు దూరంలో ఉన్న సీసలి గ్రామానికి చెందిన గణేశ్న భానుశ్రీ లక్ష్మీ అన్నపూర్ణ ప్రత్యూష 198వ ర్యాంక్ సాధించి ఆదర్శంగా నిలిచింది. ఆమె గత ఏడాది గ్రూప్–1 పరీక్షల్లో రాష్ట్రస్థాయిలో మొదటి స్థానం సాధించి ప్రస్తుతం ఏలూరు జిల్లా కలెక్టరేట్లో డిప్యూటి కలెక్టర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. సిసిలీ గ్రామానికి చెందిన గణేశ్న వెంకట రామాంజనేయులు, ఉషా దంపతులకు ఏకైక సంతానం ప్రత్యూష. ఈ ఏడాది జనవరి 15న ఢిల్లీలో ఇంటర్వ్యూలు జరిగాయి. తల్లి గృహిణి. తండ్రి వెంకట రామాంజనేయులు ప్రభుత్వ ఉపాధ్యాయుడిగా పనిచేస్తూ ప్రస్తుతం డీఈవో ఆఫీస్‌లో ఏపీవోగా పనిచేస్తున్నారు. మొదటి ప్రయత్నంలోనే సివిల్స్‌లో ఈ ర్యాంకు సాధించారు. ఈ సందర్భంగా ఆమెను ఏలూరు జిల్లా కలెక్టర్ వై.ప్రసన్నవెంకటేష్, జేసీ బి.లావణ్య వేణి అభినందించారు. భానుశ్రీ మరిన్ని ఉన్నత శిఖరాలు అధిరోహించాలని ఆకాంక్షించారు. ఇక సివిల్స్ ఫలితాల్లో భీమవరం పట్టణం నుండి శాసన మండలి ఛైర్మన్ కొయ్యే మోషేను రాజు చిన్న కుమారుడు కొయ్యే చిట్టి రాజు జాతీయ స్థాయిలో 833 వ ర్యాంకు సాధించి సివిల్ సర్వీసెస్ కి సెలెక్ట్ అయిన సందర్బంగా నేటి ఉదయం దళిత బహజన JAC నాయకులు కొయ్యే చిట్టి రాజు ని అభినందించారు.
