సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: ఆంధ్రప్రదేశ్‌లో పదోతరగతి పరీక్షలు రాసిన 6,30,633 మంది విద్యార్థులు ఎప్పుడెప్పుడు రిజల్ట్స్ ఇస్తారా? అని ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. వారికి బోర్డ్‌ ఆఫ్‌ సెకండరీ ఎడ్యుకేషన్ అధికారులు కీలక అప్‌డేట్‌ ఇచ్చారు. ఈ నెలాఖరుకు పదో తరగతి ఫలితాలు విడుదల చేయాలని అధికారులు నిర్ణయించారు. అన్నీ అనుకూలిస్తే ఈ నెల 25నే ఫలితాలు ప్రకటించేందుకు సిద్ధం అవుతున్నారు. అయితే రాష్ట్రంలో ఎన్నికల కోడ్‌ అమలులో ఉన్నందున పరీక్ష ఫలితాల విడుదలకు ఈసీ అనుమతి తప్పనిసరి. ఈ క్రమంలో ఎన్నికల సంఘం నుంచి అనుమతులు రాగానే నెలాఖరుకు ఫలితాలు ప్రకటించేందుకు అధికారులు సిద్ధమవుతున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *