సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: ఏపీలో జరగనున్న అసెంబ్లీ, లోక్ సభ ఎన్నికలలో నేడు, గురువారం కీలక ఘట్టం చోటు చేసుకోనుంది. కాసేపట్లో ఎన్నికల నోటిఫికేషన్ జారీ కానుంది. నోటిఫికేషన్ జారీ తర్వాత నేటి ఉదయం 11 గంటల నుండి నామినేషన్ పక్రియ ప్రారంభము అయ్యి... ఈ నెల 25 వరకూ నామినేషన్ల స్వీకరణ కార్యక్రమం ఉండనుంది. సెలవు దినాలు మినహా మిగిలిన రోజుల్లో ఉదయం 11 నుంచి నామినేషన్లను అధికారులు స్వీకరిస్తారు. పార్లమెంట్ స్థానాలకు కలెక్టరేట్‌లలో, అసెంబ్లీ స్థానాలకు ఆయా నియోజకవర్గ ఆర్డీఓ కార్యాలయాలలో నామినేషన్ల స్వీకరణ కార్యక్రమం ఉంటుంది. నామినేషన్ వేసే అభ్యర్థితో పాటు మరో నలుగురికి మాత్రమే ఆర్వో కార్యాలయం లోపలికి అనుమతి ఇవ్వనున్నారు. నామి నేషన్‌ దాఖలు సమయంలో రిటర్నింగ్‌ అధికారి కార్యాలయ పరిధిలో 100 మీటర్లలోపు అభ్యర్థికి చెందిన మూడు వాహనా లకు మాత్రమే అనుమతి ఇస్తాం నామినేషన్ వేసే అభ్యర్థుల ఊరేగింపుతో పాటు దాఖలు చేసే ప్రాంతంలో పూర్తిగా అధికారులు వీడియో రికార్డింగ్ చేయనున్నారు. అన్ని అసెంబ్లీ నియోజకవర్గాలలో హెల్ప్ డెస్క్ లు ఏర్పాటు చేయడం జరిగింది. రేపు, ఈనెల 22, 25 తేదీలు మంచి రోజులు కావడంతో ఎక్కువ నామినేషన్‌లు వేసే అవకాశం ఉంది. ఇకపై మీడియా సంస్థలలో రాజకీయ పార్టీల గెలుచుకొనే సీట్లపై సర్వేలు ప్రచురించడం ప్రసారం చెయ్యడం నిషేధం..

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *