సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: భీమవరం వైసీపీ అభ్యర్థి ఎమ్మెల్యే కు మద్దతు ఇస్తూ భీమవరం 1వార్డు మాజీ కౌన్సిలర్ పంతం సతీష్ వైసీపీ లో చేరిపోవడం పట్టణంలో హాట్ టాపిక్ గా మారింది. ఎందుకంటే గత 3 దశాబ్దాలుగా తెలుగుదేశం పార్టీలో క్రమశిక్షణ కల కార్యకర్తగా కీలక నేతగా మెంటే వారి తోటలో 1 మరియు 2వార్డు ప్రజలతో రాజకీయాలకు అతీతంగా మంచి సాన్నిహిత్యం ఉన్న పంతం సతీష్, వైసీపీ లో చేరటం వైసీపీ శ్రేణులలో ఉత్సహం నింపింది. సుదీర్ఘ కాలంగా టీడీపీ పనిచేస్తున్నప్పటికీ ప్రస్తుత కూటమిలో జరుగుతున్నా పరిణామాల నేపథ్యంలో గత 5 ఏళ్లుగా సీఎం జగన్ పాలన, భీమవరంలో జరిగిన అభివృద్ధి పట్ల ఆకర్షితుడై వైసీపీ లో చేరినట్లు ఆయన ప్రకటించారు. ఎమెల్య గ్రంధి శ్రీనివాస్ వైసీపీ కండువా కప్పి పంతం సతీష్ ను పార్టీలోకి ఆహ్వానించారు. ఈ కార్యక్రమం లో, వేండ్ర వెంకట స్వామి, తోటబోగయ్య, ఏ ఎస్ రాజు, అభిరుచి రఘు, పలువురు మాజీ కౌన్సెలర్స్ పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *