సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: పశ్చిమ గోదావరి జిల్లాలో ఎన్నికల ప్రచారంలో భాగంగా జనసేనాని పవన్ తన ఎన్నికల బహిరంగ సభ నరసాపురంలో నేటి ,ఆదివారం సాయంత్రం ప్రారంభించారు. తనకు నరసాపురం, మొగల్తూరు రెండు తీపి జ్ఞాపకాలని అన్నారు. తదుపరి రాత్రి 9 గంటలకు భీమవరం లోని ప్రధాన సెంటర్ ప్రకాశం చౌక్ లో బహిరంగ సభలో పాల్గొన్నారు. భీమవరం అభ్యర్థి అంజిబాబు, ఉండి టీడీపీ అభ్యర్థి రఘురామా కృష్ణంరాజు, ఎంపీ బీజేపీ అభ్యర్థి శ్రీనివాస వర్మ ను సభకు పరిచయం చేసి వారికి విజయం చేకూర్చాలని అశేష అభిమానులకు విజ్ఞప్తి చేసారు. పవన్ మాట్లాడుతూ.. ఇక్కడ భీమవరంలో మొన్న సీఎం జగన్ బహిరంగ సభలో నాపై రెచ్చిపోయి మాట్లాడారని, ఇక్కడ గ్రంధి శ్రీనివాస్ ప్రజా బలానికి భయపడి భీమవరంలో పవన్ కళ్యాణ్ పోటీ చెయ్యకుండా పారిపోయాడని వ్యాఖ్యానించారని, నేను ఓటమికి భయపడను . భీమవరం నా గుండెలలో ఉంది. ఇక్కడ అంజిబాబు ను గెలిపించి జనసేన ను మరింత బలోపేతం చేస్తాను. ఇక్కడ గ్రంధి శ్రీనివాస్ చేసిన అభివృద్ధి ఏమిలేదు.. బెదిరించడం తప్ప..అర్బన్ బ్యాంకు ముంచేశారు. భీమవరంలో గ్రంధి శ్రీనివాస్ అతని అనుచరులు రౌడీ సామ్రాజ్యాన్ని కూల్చేస్తాను..వారంతా కలసి ఏ సెంటర్ కు రామన్న నేను ఒక్కడినే వస్తాను. ఇక్కడ గ్రంధి శ్రీను నాకు ఇల్లు అమ్ముతానని చెప్పిన వ్యక్తిని బెదిరించారు. అంజిబాబు గారికి డబ్బు ఇస్తాను భీమవరంలో నాకు ఇల్లు కావాలి.కొనిపెట్టండి అన్నారు. నా జన సైనికులు సౌమ్యులు.. నిజాయితీ పరులు..యువకులు. వారిపై అక్రమంగా కేసులు పెడుతున్నారు. గ్రంధి శ్రీనివాస్ ను అడ్డం పెట్టుకొని రౌడీ లు చెలరేగుతున్నారు. ప్రశాంతంగా ఉండే భీమవరం కోసం కూటమి అభ్యర్థి కి ఓటు వెయ్యండి. ఇక్కడ ఏమి జరిగిన అంజిబాబు కు అండగా నేను ఇక్కడకు వస్తాను అన్నారు. ఎదో కుటుంబ సమస్యల వల్ల నా నుండి విడిపోయిన నా భార్యల గూర్చి ప్రతి సభలో జగన్ మాట్లాడుతున్నాడు . అతనో మూర్కుడు.. అంటూ పలుమారులు ఆవేశపడ్డారు. ఇప్పడు ఉన్న పధకాలు ఏమి మేము అధికారంలోకి వస్తే తొలగించే ప్రశ్న లేదు.. ఇంకా కొత్తవి ఇస్తాము . మమ్మలిని నమ్మండి.. కేంద్రంలో మోడీని . ఇక్కడ చంద్రబాబు ను, నన్ను నమ్మి ఓటెయ్యండి అని పవన్ ఆవేశపూరిత ప్రసంగం చేసారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *