సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: నరసాపురం పార్లమెంట్ వైఎస్ఆర్సీపీ అభ్యర్దిని గూడూరి ఉమాబాల నేడు, బుధవారం పాలకొల్లు నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థి గూడాల శ్రీహరి గోపాలరావు(గోపి) భారీ నామినేషన్ కార్యక్రమంలో పాల్గొన్నారు. పాలకొల్లు పట్టణ వీధుల మీదుగా వైసీపీ క్యాడర్ చేప్పట్టిన భారీ బైక్స్ ర్యాలీలో, కాన్వాయి వాహనం ఫై ఆమె మరియు అభ్యర్థి గోపీ కార్యకర్తలకు ప్రజలకు అభివాదం చేస్తూ ముందుకు సాగారు. ఈ కార్యక్రమంలో టీటీడీ సభ్యుడు మేకా శేషుబాబు, గుణాల నాగబాబు తదితర వైసీపీ నేతలు పాల్గొన్నారు. ఈ సందర్భముగా ఎంపీ అభ్యర్థి ఉమాబాల మాట్లాడుతూ.. జిల్లా వ్యాప్తంగా వైసీపీ ప్రభంజనం కనపడుతుందని తన విజయం అలాగే అందరు ఎమ్మెల్యే అభ్యర్థులు విజయం ఖాయంగా కనిపిస్తుందన్నారు. ఈ పాలకొల్లు ర్యాలీ లో కూడా ప్రజలు గుడాల రవి పట్ల ఎంతో అభిమానం చూపుతున్నారని అందుకే ఈ ర్యాలీ ఎర్రటి ఎండలో సైతం ఇంత జోష్ గా జరిగిందని అన్నారు.
