సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: పశ్చిమ గోదావరి జిల్లాలో వారాహి వాహనంపై ఎన్నికల ప్రచారంలో భాగంగా రేపు సోమవారం అనగా ఈనెల 29వ తేదీ న తాడేపల్లిగూడెంలో జనసేన అధినేత పవన్‌కల్యాణ్‌ పర్యటన ఉంటుందని విజయవంతం చేయాలని నియోజకవర్గ కూటమి ఎమ్మెల్యే అభ్యర్థి బొలిశెట్టి శ్రీనివాస్‌, టీడీపీ నియోజకవర్గ ఇన్‌చార్జి వలవల బాబ్జి పిలుపునిచ్చారు. పట్టణంలోని గొల్లగూడెం సెంటర్‌ రామాలయం వద్ద సాయంత్రం 5.30 గంటలకు పవన్‌కల్యాణ్‌ బహిరంగ సభ నిర్వహిస్తారు, తదుపరి తాడేపల్లిగూడెం నుంచి పిప్పర మీదుగా గణపవరం ప్రధాన సెంటర్‌లో రాత్రి ప్రజలను ఉద్దేశించి ప్రసంగిస్తారన్నారు. భీమవరం కు సమీపంలో ఉన్న గణపవరం కు భీమవరం నుండి కూడా పలువురు జనసేన, టీడీపీ, బీజేపీ పార్టీ ల కూటమి నేతలు తరలి వెళ్లనున్నారు,

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *