సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: ప్రపంచ వ్యాప్తంగా నియంతృత్వ పెత్తందారీ విధానాలపై కార్మికుల పోరాటం తో సాధించిన విజయాలకు ప్రతీకగా… నేడు, బుధవారం భీమవరంలో కార్మిక సంఘాల ఆధ్వర్యంలో వేడుకలు జరుగుతున్నాయి. అయితే మే డే తో మన సిగ్మా కు ఓ ప్రత్యక అనుబంధం ఉంది. పట్టణ ప్రజలకు ప్రత్యక్షంగా, పరోక్షంగా ‘ఏకంగా 15ఏళ్ళు పైగా’ మొత్తంగా కోట్ల రూపాయల డబ్బు ఆదా అయ్యింది. మే డే స్ఫూర్తి తో భీమవరంలో 2002 లోనే నెలవారీ 150 -170 రూపాయలు పైగా అధిక ధరలు వసూళ్లు చేసే మోనోఫలి కేబుల్ టివి వ్యవస్థపై విజయ కేతనం ఎగురవేసిన సిగ్మా కేబుల్ టివి ప్రస్థానం గుర్తుకు తెచ్చుకోవాలి. 1992 లో ఒక చిన్న కేబుల్ టివి నెట్ వర్క్ గా భీమవరంలోని ఇండియన్ బ్యాంకు రోడ్డు పరిధిలో కేవలం నెలవారీ 50 రుసుముతో ప్రారంభించబడిన సిగ్మా కేబుల్ టివి ప్రసారాలలో అపట్లో ఎన్నో సాంకేతిక విజయాలు సాధించింది. పట్టణంలో తొలిసారి వార్తలు అందించే న్యూస్ ఛానెల్స్ ద్వారా ప్రజా సమస్యల పరిష్కారానికి కృషి చేసింది. అంతేకాదు 1994 సంవత్సరంలో పట్టణంలో తొలిసారి శ్రీ మావుళ్ళమ్మవారి ఉత్సవాల ప్రత్యక్ష ప్రసారాలు, అంత్యాక్షరి ప్రసారాలు, మునిసిపల్ ఎన్నికల కౌంటింగ్ హాలు విశేషాలు శరవేగంగా అందించింది. అయితే పట్టణంలో మోనోపలీ కేబుల్ వ్యవస్థ బలంగా పెరిగి నెలవారీ భారీ రుసుములు వసూళ్లు చెయ్యాలన్న ధోరణలు పెరిగిన నేపథ్యంలో .. దేశంలో ఎక్కడ లేని విధంగా సిగ్మా కేబుల్ టివి ‘2002 మే డే రోజు’ నుండి పూర్తీ స్వతంత్రగా 3 లోకల్ ఛానెల్స్ తో పాటు 45ఛానెల్స్ 30 రూపాయలకే అందించింది. ఆర్ధికంగా తాను ఎంత నష్టపోయిన సరే.. సామాన్య కుటుంబాలకు అండగా నిలచింది. ఇదొక సుదీర్ఘ పోరాటం ..అపట్లో సిగ్మా కేబుల్ టివి ఉనికి లేకుండా చెయ్యాలని ఎన్నో తరహా దాడులు, ఒత్తిడులు తో సిగ్మా కు ప్రజలకు వినోదాన్ని అందించే పే ఛానెల్స్ ప్రసారాలు నిలచిపోయాయి. టీవీ సంస్థలకు డబ్బు కడతాము అన్న.. పే ఛానెల్స్ ఇచ్చేవారు లేరు. ఈ టివి , మాటివి , జీ తెలుగు వంటి ఛానెల్స్ తిరిగి సాధించడం కోసం ఢిల్లీ లోని ట్రాయ్ కోర్టులో పలుమారులు సిగ్మా కేబుల్ టివి చేసిన పోరాటాలు ఆ కేసులు అంత ఇంతా కాదు.. అయితే అంతిమ విజయం సిగ్మా కేబుల్ సాధించింది. కొందరు స్వార్ధపరులు కేబుల్ వైర్లు కత్తిరించడం, ప్రసారాలు ఆపడం ఎన్నో కష్టాలు నష్టాలు తట్టుకోవలసి వచ్చింది.అయిన మడమ త్రిప్పని పోరాటం.. అప్పట్లో కేబుల్ టివి పోటీ నేపథ్యంలో .. భీమవరం పట్టణంలో ఉచితంగా కూడా ప్రజలు పొందే పరిస్థితి వచ్చేసింది. 2017వరకు ఇదే తీరు.. 16 ఏళ్ళు పాటు కొనసాగింది. ఆఖరికి 2017 జనవరి నెల నుండి ప్రధాని మోడీ, కేబుల్ టివి డిజిటలైజేషన్ చెయ్యడంతో ప్రతి కేబుల్ టీవీ వినియోగదారుడు 2000 రూపాయలు పైగా ఖరీదయిన సెట్ అఫ్ బాక్స్ వాడి ఛానెల్స్ బట్టి డబ్బు చెల్లించాలని ఆదేశాలు అమలు కావడంతో సిగ్మా కేబుల్ టివి అనివార్య పరిస్థితులలో 24 ఏళ్ళ తన ప్రస్థానానికి ముగింపు పలికింది. అయితే భీమవరంలో 30 రూపాయలు కేబుల్ టివిగా అపట్లో రాష్ట్ర వ్యాప్తంగా చాల ప్రాంతాలలో కొత్త కేబుల్ టివి నెట్ వర్క్స్ ఆగమనానికి ప్రేరణగా నిలచింది. ఈ రోజు చిన్నారులు ఎంతో ఇష్టంగా చూసే డిస్నీ, నిక్, మూవీస్ నౌ , నియో స్పోర్ట్స్ వంటి ఎన్నో కొత్త పే ఛానెల్స్ ను భీమవరంలో తొలిసారి ప్రారంభించిన ఘనత కూడా సిగ్మా కేబుల్ టివి దే ..ఒక స్వచ్చంద సంస్థ తరహాలో ప్రజల కోసం పోరాడిన సిగ్మా కేబుల్ టివి కి మే డే చరిత్రలో ఒక పేజీ ఉంటుంది.. సిగ్మా పోరాటానికి సహకరించిన అందరికి ‘మే డే’ లాల్ సలాం..మీ.. సిగ్మా ప్రసాద్ కాలమ్స్,
